For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'దూకుడు'లో ఆ డైలాగే హాట్ టాపిక్

    By Srikanya
    |

    మహేష్, సమంత కాంబినేషన్ లో శ్రీను వైట్ల రూపొందించిన దూకుడు చిత్రం మొన్న శుక్రవారం భారీ ఎత్తున రికార్డు స్క్రీన్స్ తో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోయిన్ ని చూసి... డౌట్ లేదు.. ఇది ఏ టైపిస్టుతోనో లేచిపోతుంది అంటాడు. అది విన్న వారంతా ఈ కంప్యూటర్ కాలంలో టైప్ మిషన్ గురించి డైలాగ్ రావటం ఏమిటని అంటున్నారు. ఆ మాత్రం కూడా డైలాగు రైటర్ చూసుకోలేదా అంటున్నారు. ఈ చిత్రానికి డైలాగు రైటర్ కోనవెంకట్. అయితే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అని శ్రీనువైట్ల వేసుకుంటాడు కాబట్టి ఆయన ఈ డైలాగుని రాసాడేమో అంటున్నారు.

    ఇక ఈ చిత్రం మహేష్ ఇమేజ్ ని తగ్గించిందని అభిమానులు సైతం అంటున్నా కలెక్షన్స్ మాత్రం అదరకొడుతున్నాయి. కామిడి కి జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్ ఎస్ నారాయణ, బ్రహ్మానందం, మహేష్ ల మధ్య వచ్చే కామిడి సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే సమంత గ్లామర్ కూడా ఓ వర్గాన్ని ఆకట్టుకుంటోంది. ఇక మహేష్ తను ఖలేజాలో చేసిన పాత్రకు కంటిన్యూషన్ గా ఈ పాత్ర ముందుకు వెళ్థుంది. నాజర్ తో చేసిన తండ్రి సెంటిమెంట్ సీన్స్ ఫ్యామిలీలకు బాగా పడుతున్నట్లు చెప్తున్నారు. అలాగే యూత్ ని పోలీస్ ఆఫీసర్ గా మహేష్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి.

    English summary
    Mahesh Babu-Dookudu released last friday with positive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X