అశ్లీలతే ఆయుధంగా... రెచ్చిపోతున్న బ్యాడ్ లేడీస్
అందం... హద్దుల్లో ఉండే మరింత అందంగా కనిపిస్తుంది...అదే హద్దు దాటితే అశ్లీలమై వికృత రూపం దాలుస్తుంది. ప్రస్తుతం సినీ రంగంలో, మోడలింగ్ రంగంలో పెరిగి పోతున్న పోటీ వాతావరణం దృష్ట్యా కొందరు భామలు బరితెగిస్తున్నారు. నూలు పోగు కూడా లేకుండా అంగాంగ ప్రదర్శన చేయడానికి వారు ఏమాత్రం సంకోచించడం లేదు. సోషల్ నెట్వర్కింగ్ మీడియాను వేదికగా చేసుకుని పోటా పోటీగా తమ అందాలతో బీభత్సం సృష్టిస్తున్నారు.
ప్రస్తుతం భారత్‌లో ఈ రేంజిలో రెచ్చి పోతున్న భామల్లో ముందు వరుసలో ఉండేది పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా. ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగు సైట్లను వేదికగా చేసుకుని ఈ ఇద్దరు తమ అందాల ప్రదర్శనతో రెచ్చిపోతున్నారు. మొదట్లో అందంగా మొదలైన వీరి ప్రదర్శన కాస్తా..... రాను రాను అశ్లీలంగా మారింది.
ఒకరిని మించి ఒకరు అశ్లీల భంగిలు, న్యూడ్ ఫోటోలు పోస్టు చేస్తూ జనాల్లో పాపులర్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ మధ్య వల్గర్ కామెంట్స్, బూతు మాటలు మాట్లాడుతూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. అయితే జనాల్లోనూ ఇలాంటి భామాలపై క్రేజ్ పెరిగి పోయింది. వీరిని సోషల్ నెట్వర్కింగ్ మీడియాలో ఫోలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే. జనాల్లో బూతుపై, ఇలాంటి బూతు భామలపై మోజు పెరిగి పోతుందనడానికి ఇదొక నిదర్శనం.
పాశ్చాత్య పోకడల మోజులో పడి కొందరు భారతీయ సుందరాంగులు ఇలా దారి తప్పి చేస్తున్న ప్రయాణం చివరకు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో...వారిని ప్రోత్సహించే విధంగా జనాలు ప్రవర్తిస్తున్న తీరు సమాజంలో ఎలాంటి మార్పులకు కారణం అవుతుందో...!


Click it and Unblock the Notifications











