హన్సికకు, మెహర్ రమేష్ కి మధ్య లవ్ మ్యాటర్ నడుస్తోందని ఆ మధ్య వార్తలు వినిపిచ్చాయి. అయితే అలాంటిదేం లేదన్నట్లు ఇవాళ ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో హన్సిక అతన్ని అన్నయ్య అంటూ నొక్కి వక్కానించింది. బిల్లా చిత్రంలో ప్రత్యకపాత్ర చేస్తున్నారు కదా..మీ కెరిర్ కి అదెలా ఉపయోగపడుతుంది అని ఆమెని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం చెపుతూ..ఈ సినిమాను నేను దర్శకుడు మెహర్ రమేష్ వల్ల ఒప్పుకొన్నాను. తను నాకు అన్నయ్యలాంటి వాడు. ఒక పాట, కొన్ని సీన్స్ చేయాలన్నాడు. సరే అన్నాను. ఆ దేవుడి దయవల్ల, ప్రేక్షకుల దయవల్ల నా కెరీరియర్ బాగానే ఉంది. కొత్తగా భిల్లాలోని పాత్ర లోని పాత్ర వల్ల నాకేదైనా ప్లస్ జరగాలని కోరుకోను. ఒకవేల ప్లస్ అయితే అంతకన్నా మరొకటి ఉండదు అంది. అదీ సంగతి.