ఆసిన్ ప్రవర్తన చూసి షాక్ అవుతున్నారంతా....

సాధారణంగా హీరోయిన్లు సినిమా సెట్ లో ఉన్నప్పుడు...మామూలుగా హీరో, దర్శకులను తప్ప ఇతరులను కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోరు. కానీ ఆసిన్ అలాంటి బిహేవియర్ కి భిన్నంగా యూనిట్ సభ్యులను ప్రతి ఒక్కరిని పలకరిస్తుందట. అంతేకాకుండా అందరితో కలిసి భోజనం కూడా చేస్తుంది. ప్రస్తుతం హౌజ్ ఫుల్ 2 సినిమాలో నటిస్తున్న ఈ భామ యూనిట్ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇలా ఒక హీరోయిన్ తమను ఒంత గొప్పగా ట్రీట్ చేయడం పట్ల ఆశ్చర్యపోతున్నారంతా.
సినిమా సెట్లలలో సంగతి పక్కన పెడితే...ముంబైలో ఆసిన్ కి ఇప్పటికే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు కూడా. వారితో ఖాళీ దొరికినప్పడు, ముఖ్యంగా వీకెండ్స్ లో ఖుషీగా గడుపుతోంది. ఆసిన ప్రవర్తన చూసి షాక్ అవ్వడం ఇతర హీరోయిన్లు, హీరోల వంతువుతోంది.


Click it and Unblock the Notifications











