షాకింగ్: పోర్న్ సైట్స్‌లో బిగ్ బాస్ బ్యూటీ.. అందుబాటులో ఫోన్ నెంబర్.. వివాదంగా
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఆన్ లైన్ వేదికలపై ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్ఫింగ్ పద్దతులను ఆసరాగా చేసుకొని కొందరు హాట్ భామలను టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. తాజాగా తన ఫోటోలు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్‌లో పెట్టారని పేర్కొంటూ సంచలనం సృష్టించింది బిగ్ బాస్ బ్యూటీ మీరా మిథున్. వివరాల్లోకి పోతే..

మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత
తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో 3వ సీజన్లో పాల్గొంటున్న కొందరు కంటెస్టెంట్లు కేవలం హౌస్‌లో మాత్రమే కాదు బయటకు వచ్చిన తర్వాత కూడా పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. అందులో ఒకరే మీరా మిథున్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, పలు సినిమాల్లో కూడా నటించిన ఈమె వివాదాలకు పెట్టింది పేరుగా మారుతోంది.

గ్లామర్ షో.. ముందు నుంచీ వివాదాస్పదమే
తమిళ బిగ్ బాస్ రియాలిటీ షో ఉన్నంత కాలం తన గ్లామర్ షోతో అదరగొట్టేది మీరా మిథున్. అలా బిగ్ బాస్ హౌజ్‌లో 35 రోజులు ఉన్న మీరా మిథున్ తన స్కిన్ షోతో మత్తెక్కిస్తూనే వివాదాలు సృష్టిస్తూ తెగ హడావిడి చేసింది. అంతేకాదు మీరా మిథున్ వ్యవహారం ముందు నుంచీ వివాదాస్పదమే. ఆమెపై చీటింగ్ ఆరోపణలు కూడా ఉన్నట్లుగా తమిళ మీడియాలో గతంలో వార్తలు వచ్చాయి.

కమల్ హాసన్‌పై ఆరోపణలు.. ఓ రేంజ్‌లో ఫైర్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్‌పై, ఆయన కూతురు అక్షర హాసన్ పై కూడా ఆరోపణలు చేసి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది మీరా. సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం (బంధుప్రీతి) ఉందన్నట్లుగా పేర్కొంటూ కమల్ హాసన్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన ఆమె.. తనకు వచ్చిన సినిమా అవకాశాన్ని తప్పించి, తన స్థానంలో తన కూతురు అక్షర హాసన్‌ని ఎంపిక చేసుకున్నారని ఆరోపణలు గుప్పిస్తూ హల్చల్ చేసింది.

మిస్ ఇండియా సౌత్.. మోసం చేసిన బ్యూటీ
2016లో మిస్ ఇండియా సౌత్ కిరీటం దక్కించున్న ఆమె దాన్ని దుర్వినియగం చేయడంతో నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. ఇదే కాకుండా మీరా తనను మోసం చేసినట్లు గతంలో ఓ డిజైనర్ కేసు పెట్టారు. అంతే కాదు ఆమె మనీలాండరింగ్‌కు పాల్పడినట్లుగా కూడా ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

పోర్న్ సైట్స్‌లో ఫోటోలు, ఫోన్ నెంబర్
కాగా, ఇప్పుడు తన ఫోటోలను కొంతమంది వ్యక్తులు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్స్ లో పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ మరోసారి పెద్ద వివాదాన్ని సృష్టించింది మీరా మిథున్. అంతేకాదు దీనికి తోడు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంచారని ఆరోపిస్తోంది. దీనిపై వెంటనే తమిళనాడు పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.
Recommended Video

సీరియస్ యాక్షన్.. వదిలిపెట్ట
ఇలా చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటానని మీరా మిథున్ చెప్పింది. తనని డీఫేమ్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని దీని వెనకాల ఎవరు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదని ఆమె పేర్కొంది.


Click it and Unblock the Notifications











