దిల్ రాజు రెండో పెళ్లి సంగతులు.. ఫిలింనగర్‌లో హాట్ ఇష్యూ.. ఇదీ అసలు మ్యాటర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్‌గా పేరుగాంచారు దిల్ రాజు. మొదటగా 'దిల్' సినిమాకు నిర్మాతగా వ్యవహరించి భారీ లాభాలు గడించిన ఆయన ఇప్పటిదాకా వెనుదిరిగి చూసే అవసరమే రాలేదు. కాకపోతే కాలానుగుణంగా వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భార్య అనితను కోల్పోయారు. ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన రెండో పెళ్ళికి రెడీ అయినట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి. వివరాల్లోకి పోతే..

సూపర్ ఫామ్‌లో దిల్ రాజు

సూపర్ ఫామ్‌లో దిల్ రాజు

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా తిరుగులేని ఇమేజ్ సంపాదించారు దిల్ రాజు.ఒకప్పటి బడా ప్రొడ్యూసర్స్ రామానాయుడు, అల్లు అరవింద్, సురేష్ బాబు రేంజ్‌లో దిల్ రాజు క్రెడిట్ కొట్టేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరిలో దిల్ రాజు సూపర్ ఫామ్‌లో ఉండి వరుస విజయాలు అందుకుంటున్నారు.

భార్య మరణం.. కూతురు పెళ్లి

భార్య మరణం.. కూతురు పెళ్లి

దిల్ రాజు భార్య అనిత అంటే ఆయనకు మహా ప్రేమ. ఆయన నిర్మించిన ప్రతీ సినిమాలోనూ ముందుగా అనిత పేరు వేస్తుంటారు దిల్ రాజు. అయితే మూడేళ్ళ క్రితం ఆమె ఆకస్మిక మరణం దిల్ రాజును కుంగదీసింది. అయినప్పటికీ తనను తాను దైర్యంగా నిలుస్తూ ఒక్కగానొక్క కూతురు పెళ్లి కూడా చేసేశారు దిల్ రాజు.

 ఒంటరిగా దిల్ రాజు.. పరిస్థితుల కారణంగా

ఒంటరిగా దిల్ రాజు.. పరిస్థితుల కారణంగా

దీంతో ప్రస్తుతం దిల్ రాజు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సలహా మేరకు ఆయన రెండో పెళ్ళికి సిద్దమైనట్లు తెలుస్తోంది. సినిమాల్లో సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్న నువ్వు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, మరో పెళ్లి చేసుకొని కాస్త రిలాక్స్ కావాలని దిల్ రాజు సన్నిహితులు చెప్పారట. ఈ మేరకు దిల్ రాజు ఆలోచనలో పడినట్లు సమాచారం.

కూతురిదే ఫైనల్ డిసీజన్

కూతురిదే ఫైనల్ డిసీజన్

దిల్ రాజు కూతురు నిర్ణయంపైనే ఆయన రెండో పెళ్లి ఆధారపడి ఉందని ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఈ మేరకు రెండో పెళ్లి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఈ ఇష్యూపై దిల్ రాజు ఎలా స్పందిస్తారనేది.

Recommended Video

Dil Raju Speech At Sarileru Neekevvaru Success Meet
దిల్ రాజు మేజర్ అసెట్ అదే..

దిల్ రాజు మేజర్ అసెట్ అదే..

ఇకపోతే మరోవైపు రాజుగారి బ్యానర్‌లో వచ్చిన సినిమాలు కాసుల పంట పండిస్తూనే ఉన్నాయి. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు నిర్మాణంలో భాగమై లాభాలు గడించిన ఈ ప్రొడ్యూసర్.. తాజాగా 'జాను' నిర్మించి సక్సెస్ బాటలో పయనిస్తున్నారు. ఏదేమైనా దిల్ రాజు బ్యానర్ అంటే అంటేనే ఆ సినిమా హిట్టు అనే టాక్ జనాల్లో ఉండటం ఆయనకున్న మేజర్ అసెట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X