»   »  ఆంధ్రా షకీలా...

ఆంధ్రా షకీలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Bhuvaneswari
షకీలా అంటే తెలియని సినీ ప్రియులు దాదాపు అరుదు. ప్రస్తుతం ఆమె పెళ్ళి చేసుకుని రిటైర్ మెంట్ కి రెడీగా ఉంది. మరి ఆ ప్లేసుని ఫిలప్ చేసేదెవరు అంటే ఇప్పుడొక ప్రౌడ నటి అందరినీ తన స్టిల్లులతో ఆకట్టుకుంటోంది. ఆమె మరెవరో కాదు. టీవి సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యి మెల్లిమెల్లిగా అవకాశాలు పొందుతున్న భువనేశ్వరి. ఎక్స్ పోజింగ్ మొహమాటపడకుండా...ముందుకొస్తున్న ఈమె ప్రస్తుతం కుర్ కురే' అనే హాస్య ప్రధాన చిత్రంలో చేస్తోంది. హిందిలో హిట్టయిన 'భేజా ఫ్రై' అనే సినిమాకు ఫ్రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో కామిడీ కన్నా భువనేశ్వరి అంగాంగ ప్రదర్శనే అదరుతుందని యూనిట్ వర్గాలు ధీమాగా ఉన్నారు. పదకొండున రిలీజవుతున్న ఈ చిన్న సినిమాకి ఆ మాత్రమన్నా క్రేజ్ వచ్చిందంటే ఆమె మితిమీరిన ఎక్స్ పోజింగ్ తో కూడిన పోస్టర్స్ అంటున్నారు. మరి ఈ సినిమా కనుక వర్కవుట్ అయితే ఆమెకు మరెన్ని ఈ తరహా అవకాశాలు వచ్చి ఆంథ్రా షకీలాగా మారుతుందని సీనియర్లు ఊహాగానాలు చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X