Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఆమెకు పిల్లలు పుట్టకే డిమాండ్ పెర్గింది
ఇడియట్ హీరోయిన్ రక్షిత ఆ మూడున్నర ఏళ్ళ క్రిందట ప్రేమ్ అనే కన్నడ నిర్మాతను పెళ్ళి చేసుకుని గృహిణిగా సెటిలైంది. అంతేగాక ఓ సంవత్సరం క్రితం సూర్య అనే బాబుకు జన్మనిచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఆమెను తమ సినిమాల్లో యాక్ట్ చేయమని అడగని వారు ఈ మద్య ఓ పంక్షన్ లో ఆమెను చూసి క్యూలు కడుతున్నారు. ఆఫర్ల వరద వస్తోందని ఆమె ఆశ్చర్యపోతోంది. ఇదే విషయాన్ని ఆమె చెపుతూ..వేర్వేరు దర్శకుల నుంచి నాకు స్క్రిప్టులు, ఫోన్స్ వస్తున్నాయి. నిర్మాతలు తమ ప్రాజెక్టులలో చేయమని మా ఆయన ద్వారా నన్ను ఎప్రోచ్ అవుతున్నారు. వాటిల్లో కొన్ని స్క్రిప్టులు బాగున్నాయి కూడా. అయితే ఏదీ ఇంకా కమిట్ కాలేదు. అయితే ఒక్క సారి నా రీ ఎంట్రీ గురించి ఫిక్స్ అయితే టాక్స్ మొదలవుతాయి. రెమ్యునేషన్ కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారు. ఇవి కాక వేర్వేరు ఛానెల్స్ నుంచీ తమ పోగ్రామ్స్ కు యాంకర్ గా చేయమని ఆఫర్స్ వస్తున్నాయి. తేరే మేరా బీచ్ మే వంటి ఎంటర్టైన్మెంట్ పోగ్రాం కూడా ఆఫర్ చేసారు. అయితే నేనింకా ఏదీ డిసైడ్ చేసుకోలేదు. ప్రస్తుతానికి మా సొంత ప్రొడక్షన్ జోగయ్య అనే కన్నడ సినిమాలో చేస్తున్నాను. దాని రిజల్ట్ ని బట్టి మిగతా వాటి ఎంపిక ఉంటుంది అని చెప్తోంది.అయితే పిల్లలు పుట్టాక ఆమెకు డిమాండ్ రావటానికి కారణం ఆంటీ పాత్రలకు సరిపోతుందని..అలాంటివి ఆఫర్ చేసినా కాదనదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.