వాయించటం నేర్చుకుంటున్న ముమైత్ ఖాన్
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ పేజీ త్రీ బ్యాచ్ కి ముమైత్ ఖాన్ ఏ పబ్ లోనూ కనపడటం లేదు. కారణం ఏమిటీ...ఎక్కడకెళ్ళిందీ అంటే ఆమె ముంబైలో ఉంటోందని సమాచారం. ఏమన్నా హిందీ చిత్రం చేస్తోందా...లేక తమిళ చిత్రంకి ఐటం సాంగ్ చేస్తోందా అంటే అక్కడ గిటార్ లెస్సన్స్ నేర్చుకుంటోందని తేలింది. ఓ హిందీ, తెలుగు చిత్రం కోసం అక్కడ కెళ్ళిన ముమైత్ ముంబైలో శరీరాన్ని తగ్గించుకుంటూ, గిటార్ నేర్చుకుంటూ కాలం గడుపుతోంది. దాంతో ఇది విన్న తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్ళు త్వరగా వాయించటం నేర్చుకుని మ్యూజిక్ డైరక్టర్ అవుతానని మనల్ని వాయిస్తుదేమో అని గుసగుసలుపోతున్నారు. ప్రస్తుతం ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రధారిగా తెలుగులో 'యల్-బోర్డ్' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హిందీలో తయారవుతున్న 'లవ్ డాట్ కామ్' కి తెలుగు రూపం ఇది.
'యల్-బోర్డ్' చిత్రం త్వరలోనే రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఒక క్యాబరే డాన్సర్‌కీ, మాఫియా గ్యాంగ్ లో పనిచేసే ఓ యువకుడికీ మధ్య చిగురించిన ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేది చిత్ర కథాంశం. మాఫియా గ్యాంగ్ నుంచి తన ప్రియుణ్ణి బయటకు తీసుకురావడానికి ఆ గ్యాంగ్ లీడర్ తో ఆమెకి ఎదురయ్యే సంఘటనలుతో చిత్రం నిండిఉంటుంది. బప్పీలహిరి సంగీతం సమకూర్చిన నాలుగు పాటలు ఎంతో మధురంగా ఉంటాయి. ఆమెను పైకి తెచ్చిన పూరీ సైతం డల్ గా ఉండటంతో ఆమె ముంబై నుంచే మరిన్ని హిందీ సినిమాలకు ప్రయత్నాలు చేస్తోందని, అక్కడ ఉండే అదో క్రేజ్ అని తెలుగు వాళ్లు వచ్చి మళ్లీ ఆమెను సినిమాల్లో బుక్ చేసుకుంటారని ఆమె ఆలచన అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











