జూ ఎన్టీఆర్ ‘దమ్ము’లో దుమ్మురేపే ఐటమ్ సాంగ్ తో నమిత..!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దమ్ము". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దమ్ము" సినిమాలో హాట్ బ్యూటీ నమిత ఓ ఐటెం సాంగ్ చెయ్యబోతున్నట్టు సమాచారం. ఈ నెల 7(07.10.11) నుంచి స్పెషల్ గా వేసిన సెట్ లో ఎన్టీఆర్, నమిత పాల్గొనగా ఈ పాట చిత్రీకరణ జరగనుందని సమాచారం.
సింహా చిత్రంలో నమిత నటించడం వల్ల ఆ సినిమా సూపర్ హిట్ అయిందనే సెంటిమెంట్ తో నమితతో ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కు బోయపాటి శ్రీను తీసుకుంటున్నాడని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ఈసారి ఆమెతో క్యారెక్టర్ కాకుండా ఐటెం సాంగ్ చేయించడానికి బోయపాటి ప్లాన్ చేసాడట. ఇందుకోసం మంచి ట్యూన్ కూడా చేయమని పురమాయించాడని అంటున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ పై కెయస్ రామారావు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











