మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న బాలయ్య వారసుడు!
హైదరాబాద్: నందమూరి ఫ్యామిలీ నుండి త్వరలో రాబోతున్న యంగ్ లయన్, బాలయ్య నటవారసుడు మోక్షజ్ఞ గురించి ఫ్యాన్స్ సర్కిల్ లో ఆసక్తి కరంగా చర్చ సాగుతోంది. అతని ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలంగా అతని గురించి ఫిల్మ్ సర్కిల్ లో చర్చ సాగుతోంది.
నందమూరి హీరోలందరూ మాస్ ఇమేజ్ తోనే పాపులర్ అయ్యారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞను కూడా మాస్ హీరోగానే తెరంగ్రేటం చేయించబోతున్నారట. అయితే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేది ఇప్పుడే కాదని, 2017లో అతని ఎంట్రీ ఉంటుందని సమాచారం. ఈ గ్యాపులో మోక్షజ్ఞను సినిమాలకు తగిన విధంగా లుక్, బాడీ లాంగ్వేజ్ ఉండేలా ట్రైనింగ్ ఇప్పిస్తున్నట్లు సమాచారం.

మోక్షజ్ఞ తొలి సినిమా తెలుగులో టాప్ మాస్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న రాజమౌళి, బోయపాటి, వినాయక్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లేదా కొత్తగా డైరెక్షన్ ఫీల్డులోకి ఎంటరై సంచనాలు సృష్టిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని అంటున్నారు. వీరిలో ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాకపోయినా....వీరిలోనే ఎవరో ఒకరు ఉంటారని టాక్.
ప్రస్తుతం మోక్షజ్ఞ తన తాతయ్య ఎన్టీఆర్ కు సంబంధించిన సినిమాలు వరుస పెట్టి చూస్తున్నాడట. తాతయ్య బాడీ లాంగ్వేజ్ అనుకరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మ్యానరిజం, స్టైల్ క్రియేట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం మోక్షు యూఎస్ఏలో తన చదువు కొనసాగిస్తూ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











