హాట్ ఫొటోస్: ‘రేయ్’ మూవీ హీరోయిన్ ఫస్ట్‌లుక్
హైదరాబాద్: మెగా స్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'రేయ్' చిత్రంలో ప్రముఖ నటి షబానా అజ్మీ మేనకోడలు సయామీ ఖేర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సయామీ ఖేర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు విడుదలయ్యాయి.
బొమ్మరిల్లు బేనర్ పై వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సయామీ ఖేర్ సాయిధరమ్ తేజ్ ప్రియురాలిగా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఆమె ఫోటోలు చూస్తుంటే దర్శకుడు ఆమెను హాట్ అండ్ సెక్సీగా సినిమాలో చూపెట్టాడని స్పష్టం అవుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈచిత్రం మార్చి నెల లాస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సయామీ ఖేర్ షబానీ అజ్మీ మేనకోడలు.

సయామీ ఖేర్ తల్లిదండ్రులు అద్వైత్ ఖేర్, మహ్రే కేర్ నాసిక్ లో ఉంటూ రెస్టారెంట్ బిజినెస్ నడుపుతున్నారు.

సయామీ ఖేర్ సోదరి సంస్కృతి మోడలింగ్ రంగంలో రాణిస్తూ హిందీ సినిమాల్లో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.

సయామీ ఖేర్ కూడా బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అయితే అంతకు ముందే ఆమెకు తెలుగు సినిమా అవకాశం దక్కింది.

రేయ్ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని సినిమా యూనిట్ సభ్యుల టాక్.


Click it and Unblock the Notifications











