నా దగ్గరకు వచ్చినప్పుడే నిర్ణయం: ప్రణీత
హైదరాబాద్ : "నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్‌ను బట్టి నేను ఆ విషయాల మీద నిర్ణయం తీసుకుంటాను. అంతేగానీ ముందే దేన్నీ ఊహించడం నాకిష్టం ఉండదు'' అని చెప్తోంది ప్రణీత. రీసెంట్ గా పవన్ తో చేసిన 'అత్తారింటికి దారేది' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత ని సినిమాల్లో కిస్ సీన్స్, హగ్గింగ్ సీన్స్ గురించి అడిగితే ఇలా స్పందిస్తోంది.
అలాగే..."అయినా నేను పార్టీలకు వెళ్లను. ఏ మాత్రం తీరిక సమయం దొరికినా ఇంట్లో ఉంటాను. కాస్త నా అందం మీద శ్రద్ధ పెడతాను'' అని చెప్పుకొచ్చింది. "ఇక ఎవరైనా మీరు ఫలానా సినిమాలో నటించినట్టున్నారు అని అంటే చాలు. తెలియని ఆనందం కలుగుతుంది. ప్రేక్షకులు మనల్ని గుర్తుపడుతున్నారు అని గెంతాలనిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో ఇంకా ఎక్కువ థ్రిల్ ఫీలయ్యేదాన్ని'' అని వివరించింది ప్రణీత.

ఇక పవన్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందనున్న ' గబ్బర్‌సింగ్-2' పనులు వేగవంతం చేసారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రణీతని ఎంపిక చేసే అవకాసమున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పవన్ తాజా చిత్రం అత్తారింటికి దారేదీలో ప్రణీత ఓ హీరోయిన్ గా చేయటం, తెలుగు అమ్మాయి కావాలన్న పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆమెను సంపత్ నంది ప్రపోజ్ చేసినట్లు చెప్తున్నారు. దాంతో బెంగుళూరు టైమ్స్ వారు ఆమెను ఈ విషయమై అడగటం జరిగింది. ఈ వార్తను ఆమె ఖండించింది. తనకు ' గబ్బర్‌సింగ్-2' ప్రపోజల్ రాలేదని చెప్పింది.


Click it and Unblock the Notifications











