For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయ గురించి రూమర్.. చిరు, వెంకీ వైజాగ్‌లో, రహస్యం ఇదే.. విరుచుకుపడ్డ కౌశల్ వైఫ్!

  |

  కథ ముగిసింది అనుకుంటే 2.0 విధ్వంసం సృష్టిస్తోంది.. ఎన్టీఆర్ సెంచరీ కొట్టాడు అంటూ ప్రచారం.. టాప్ లో భరత్ అనే నేను.. హీరోయిన్లు అంతా అయిపోయారు అంటున్న బెల్లంకొండ.. బాబు గోగినేనిపై విరుచుకుపడ్డ కౌశల్ వైఫ్.. వైజాగ్ బాట పడుతున్న చిరు, వెంకీ, నాగ్.. తిరుగులేని స్థానంలో పవన్.. చరిత్ర సృష్టించబోతున్న ఎన్టీఆర్ కథానాయకుడు.. అనసూయ గురించి రూమర్.. ఇలాంటి హాట్ హాట్ వార్తలు ఈ వారం ట్రెండింగ్ గా నిలిచాయి. ఆ వివరాలు మీరు కోసం!

   విధ్వంసం సృష్టిస్తున్న 2.0.. కథ ముగిసింది అనుకుంటే.. బాక్సాఫీస్ రిపోర్ట్!

  విధ్వంసం సృష్టిస్తున్న 2.0.. కథ ముగిసింది అనుకుంటే.. బాక్సాఫీస్ రిపోర్ట్!

  సూపర్ స్టార్ రజనీకాంత్, దిగ్గజ దర్శకుడు శంకర్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.0. గత గురువారం విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. భారత సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. ఇండియన్ సినిమాకు గర్వకారణం అంటూ కూడా ప్రశంసలు వచ్చాయి. తొలి రోజు ఈ చిత్ర వసూళ్లు నెమ్మదిగా ఆరంభం కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శంకర్, రజని క్రేజీ కాంబినేషన్ లో రూపొందింన చిత్రం కావడంతో కళ్ళు చెదిరే వసూళ్లు నమోదవుతాయని అంచనా వేశారు. హిందీ వర్షన్ లో ఈ చిత్ర నాలుగురోజుల వసూళ్లు వివరాలని ప్రముఖ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  'ఆర్ఆర్ఆర్‌' కోసం 100 దాటేసిన జూ.ఎన్టీఆర్.. షాకింగ్ లుక్ వైరల్!

  'ఆర్ఆర్ఆర్‌' కోసం 100 దాటేసిన జూ.ఎన్టీఆర్.. షాకింగ్ లుక్ వైరల్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే. టైటిల్, ఇతర విశేషాలని రాజమౌళి త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి చిత్రం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలని జక్కన్న ఎలా చూపిస్తాడో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తున్న పాత్రల గురించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారట. తాజాగా ఎన్టీఆర్ లుక్ గురించి వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  టాప్ 10లో భరత్ అనే నేను.. ట్రెండింగ్‌లో అరవింద సమేత, రంగస్థలం.. సౌత్‌లో టాప్ అతడే!

  టాప్ 10లో భరత్ అనే నేను.. ట్రెండింగ్‌లో అరవింద సమేత, రంగస్థలం.. సౌత్‌లో టాప్ అతడే!

  ఈ ఏడాది దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. సౌత్ ని ఎక్కువగా డామినేట్ చేసేది మాత్రం తెలుగు, తమిళ చిత్రాలే. ఈ ఏడాది ఎక్కువగా ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ఇండియన్ సినిమా హ్యాష్ ట్యాగులలో కొన్ని సౌత్ ఇండియన్ చిత్రాలు మొదటి 10 స్థానాల్లో చోటు దక్కించుకోవడం విశేషం. ఊహించనట్లుగానే ఇందులో స్టార్ హీరోల సినిమాలే ట్రెండింగ్ లో నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిత్రాలు టాప్ 10 లో చోటు దక్కించుకున్నాయి. కానీ అగ్రస్థానంలో తమిళ హీరో విజయ్ నిలిచాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  హీరోయిన్లు అంతా అయిపోయారు.. ఎవరనేది సస్పెన్స్, సాక్ష్యం తర్వాత 4రోజులు!

  హీరోయిన్లు అంతా అయిపోయారు.. ఎవరనేది సస్పెన్స్, సాక్ష్యం తర్వాత 4రోజులు!

  యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి వస్తున్న మరో చిత్రం కవచం. శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 7న కవచం విడుదుల కానుండడంతో శ్రీనివాస్ బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. తొలిసారి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండం విశేషం. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా అల్లుడు శీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ సరైన కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కవచం చిత్రం మంచి విజయం సాధిస్తుందని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అవమానం.. రజనీకాంత్ సినిమాపై విమర్శలు!

  లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అవమానం.. రజనీకాంత్ సినిమాపై విమర్శలు!

  గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పెట్ట చిత్రంలోని మరణ మాస్ సాంగ్ ఇంటర్నెట్ ని దున్నేస్తోంది. రజనీకాంత్ సినిమాలో అంటే మాస్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే అంశాలు ఉండాలి. అందుకు తగ్గట్లుగానే సంగీత దర్శకుడు అదిరిపోయే మాస్ బీట్ అందించారు. బి, సి సెంటర్ ఆడియన్స్ కు బాగా ఎక్కేసే డప్పు వాయిద్యాలతో అనిరుద్ మోత మోగించాడు. మరణ మాస్ సాంగ్ వింటూ రజని ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే..మరోవైపు వివాదం చెలరేగుతోంది. ఈ పాట వలన లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు హర్ట్ అయ్యారు. ఎందుకో ఆ వివరాలు చూద్దాం!

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  బిగ్‌బాస్ డిబేట్: బాబు గోగినేని మీద కౌశల్ భార్య నీలిమ ఫైర్!

  బిగ్‌బాస్ డిబేట్: బాబు గోగినేని మీద కౌశల్ భార్య నీలిమ ఫైర్!

  బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ విషయంలో పలు వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కౌశల్ ఈ సీజన్ విజేతగా నిలవడం వెనక కౌశల్ ఆర్మీ మద్దతు ఉందనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. షో జరుగుతున్నన్ని రోజులు సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కౌశల్‌కు వ్యతిరేకంగా ఏ చిన్న సంఘటన జరిగినా వారిని టార్గెట్ చేస్తూ ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీల్లో ట్రోల్ చేయడం లాంటివి అప్పట్లో సంచలనం అయ్యాయి. చివరకు షో హోస్ట్ నాని కూడా కౌశల్ ఆర్మీ సెగ ఎదుర్కొన్నారు. మరో వైపు బాబు గోగినేని కౌశల్ ఆర్మీ ఫేక్ ఆర్మీ అంటూ తన వాదన వినిపిస్తూనే ఉన్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  షూటింగ్ కోసం కాదు... చిరంజీవి, వెంకీ, ఇతర స్టార్స్ వైజాగ్ రహస్యం ఇదే!

  షూటింగ్ కోసం కాదు... చిరంజీవి, వెంకీ, ఇతర స్టార్స్ వైజాగ్ రహస్యం ఇదే!

  సినీ స్టార్స్ వైజాగ్ వెళ్లారు అంటే సినిమా షూటింగులు లేదా ఏదైనా సినిమా ఫంక్షన్ లాంటివి ఉండి ఉంటాయని అంతా భావిస్తారు. అయితే ఇవేవీ లేకున్నా చిరంజీవి, వెంకటేష్ లాంటి ప్రముఖులు, మరికొందరు టాలీవుడ్ స్టార్స్ తరచూ వైజాగ్ వెళుతుండటం చర్చనీయాంశం అయింది. ఈ విషయాలు ఆరాతీసిన అభిమానులకు, మీడియా వారికి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. వైజాగ్‌లో ఓ ప్రదేశాన్ని వారు తరచూ సందర్శిస్తున్నట్లు గుర్తించారు. మొదట సరదాగా వెళ్లి తర్వాత ఇక్కడకు రెగ్యులర్‌గా రావడం మొదలుపెట్టారట.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

   ఫోర్బ్స్ 2018: సంపాదనలో పవన్ టాప్, మహేష్‌ను మించిన ఎన్టీఆర్, చెర్రీతో సమంగా విజయ్ దేవరకొండ!

  ఫోర్బ్స్ 2018: సంపాదనలో పవన్ టాప్, మహేష్‌ను మించిన ఎన్టీఆర్, చెర్రీతో సమంగా విజయ్ దేవరకొండ!

  ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ ప్రతి ఏడాది మాదిరిగానే 2018లో ఎవరు ఎంత సంపాదించారు అనే వివరాలు విడుదల చేసింది. సెలబ్రిటీల కేటగిరీలో విడుదల చేసిన టాప్ 100 లిస్టులో రూ. 253.25 కోట్ల సంపాదనతో సల్మాన్ ఖాన్ మొదటిస్థానం దక్కించుకున్నారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఓ మై గాడ్... రెండు కళ్లు చాలవేమో? చరిత్ర సృష్టించబోతున్న ‘ఎన్టీఆర్-కథానాయకుడు’

  ఓ మై గాడ్... రెండు కళ్లు చాలవేమో? చరిత్ర సృష్టించబోతున్న ‘ఎన్టీఆర్-కథానాయకుడు’

  ఇద్దరు లేదా ముగ్గరు స్టార్స్ ఒకే సినిమాలో నటిస్తేనే మల్టీస్టారర్ అంటూ అభిమానులు తెగ మురిసిపోతారు. అలాంటిది పదుల సంఖ్యలో హీరోలు, హీరోయిన్లు ఒకే సినిమాలో కనిపిస్తే ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అదొక అద్భుతం అనుభూతి అని చెప్పక తప్పదు. అత్యంత అరుదుగా మాత్రమే ఇలాంటి కాంబినేషన్లు సాధ్యపడుతుంటాయి.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  యాంకర్ అనసూయ గురించి ఆ రూమర్ నిజమే, ఇదిగో సాక్ష్యం!

  యాంకర్ అనసూయ గురించి ఆ రూమర్ నిజమే, ఇదిగో సాక్ష్యం!

  అనసూయ భరద్వాజ్... పేరుకు యాంకరే అయినా హీరోయిన్ల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న సెలబ్రిటీ. అందుకే ఆమెతో తమ సినిమాల్లో అతిథి పాత్ర లేదా స్పెషల్ సాంగ్ చేయించడానికి దర్శకులు మొగ్గుచూపుతుంటారు.

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  ఐ లవ్ విజయ్ దేవరకొండ.. అతనంటే అమ్మాయిలకు పిచ్చి!

  ఐ లవ్ విజయ్ దేవరకొండ.. అతనంటే అమ్మాయిలకు పిచ్చి!

  హుషారు చిత్రం ద్వారా హేమల్ ఇంగే అమ్మాయి హీరోయిన్‌గా హేమల్ ఇంగే టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నది. హుషారు మూవీ డిసెంబర్ 14న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హేమల్ తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  మాసిన గెడ్డంతో వెళితే ఓట్లు పడుతాయా? పవన్‌ మాలాంటోళ్లను నమ్మడు.. దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

  మాసిన గెడ్డంతో వెళితే ఓట్లు పడుతాయా? పవన్‌ మాలాంటోళ్లను నమ్మడు.. దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

  ఆపరేషన్ 2019 సినిమాలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకొంటూ రాసిన డైలాగ్స్ వివాదంగా మారాయి. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఈ వివాదంపై దర్శకుడు కరణం బాబ్జీ వివరణ ఇచ్చారు. అసలు డైలాగ్ వివాదం ఏమిటంటే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  నాకు తీవ్రమైన అనారోగ్యం.. మూణెళ్లు హాస్పిటల్‌లోనే, మెడిసిన్ తీసుకొంటూ.. కాజల్

  నాకు తీవ్రమైన అనారోగ్యం.. మూణెళ్లు హాస్పిటల్‌లోనే, మెడిసిన్ తీసుకొంటూ.. కాజల్

  తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి కవచం అనే సినిమాలో నటిస్తున్నారు. కవచం డిసెంబర్ 7న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆమె వెల్లడించిన తన ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలు మీకోసం..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  బాలకృష్ణతో తొమ్మిది మంది హీరోయిన్లు.. ఎవరెవరు.. ఏ సినిమాలోనంటే?

  బాలకృష్ణతో తొమ్మిది మంది హీరోయిన్లు.. ఎవరెవరు.. ఏ సినిమాలోనంటే?

  క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని ఆసక్తికరమైన విషయం ఏమిటంటే. చిత్రంలో ఏకంగా తొమ్మిది మంది టాప్ హీరోయిన్లను రంగంలోకి దించడమే. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  RRRకు సవాల్.. తెరపైకి మరో భారీ మల్టీస్టారర్.. రాజమౌళికి గట్టిపోటి!

  RRRకు సవాల్.. తెరపైకి మరో భారీ మల్టీస్టారర్.. రాజమౌళికి గట్టిపోటి!

  బాహుబలి తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్‌తో మూవీ రాజమౌళి ప్లాన్ చేశాడు. అదేరకంగా తమిళంలో మణిరత్నం మరో భారీ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే..

  పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:

  English summary
  Hot rumour about anchor Anasuya. Kaushal wife Neelima fires on Babu Gogineni. Chiranjeevi and Venky Vizag secret
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X