‘సీతమ్మవాకిట్లో ...’ గురించి సమంత ట్వీట్
హైదరాబాద్ : సంక్రాంతి కానుకగా విడుదలైన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో గీత పాత్రలో కనిపించింది సమంత. ఆమె ఈ చిత్రం విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె ట్వీట్ ద్వారా తెలియచేసింది. తనకు ఈ సంవత్సరం మంచి ప్రారంభాన్ని ఇచ్చిందని ఈ చిత్రం యూనిట్ కి కృతజ్ఞతలు తెలియచేసింది.
ఆ ట్వీట్ లో... ' చాలా థ్రిల్లింగ్ గా ఉంది... వెంకటేష్ ,మహేష్ గార్లకు హ్యాట్సాఫ్...ఇంత రిస్క్ తీసుకున్నందుకు...నాకు బాగా రెస్పాన్స్ వస్తోంది. గత సంవత్సరం 'దూకుడు' తర్వాత మహేష్‌బాబుతో కలసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. గొప్ప మల్టీస్టారర్ స్వప్నాన్ని సాకారం చేసిన వెంక మహేష్‌బాబుకు హ్యాట్సాఫ్. అలాగే నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు శ్రీకాంత్‌లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ఏడాదికి మంచి శుభారంభం లభించింది' అని ట్విట్టర్‌లో పేర్కొంది సమంతా.
ప్రస్తుతం సమంత హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన, త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ సరసన హీరోయన్ గా చేస్తోంది. మరో ప్రక్క ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రేపు విడుదల అవుతున్న నాయక్ తర్వాత చేయబోయే చిత్రం ఖరారైంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయి శ్రీనివాస్ నటించే తొలి చిత్రాన్ని వినాయక్ డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో హాట్ హీరోయిన్ సమంతని ఎంపిక చేసినట్లు సమాచారం.
ఇక ఈ చిత్రం ఫిబ్రవరిలో మొదలవుతుంది. ఈ చిత్రం భారీగా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. వివి వినాయిక్ తొలిసారిగా ఓ కొత్త హీరోతో పనిచేయబోతున్నారు. బెల్లంకొండ సురేష్ తో తనకు ఉన్న అనుభందంతోనే ఈ ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం. అలాగే సమంత ఇప్పటికే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా రూపొందుతున్న నందిని రెడ్డి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.


Click it and Unblock the Notifications











