»   » హాట్ సెన్సేషన్ తాప్సీ....సందడే సందడి..

హాట్ సెన్సేషన్ తాప్సీ....సందడే సందడి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాప్సీ..టాలీవుడ్ లో ఇప్పుడు మార్మోగిపోతున్న పేరది. ఎక్కడ చూసిన ఈమె పోస్టర్లే, ఎక్కడ విన్నా ఈ సెన్సేషన్ ముద్దుగుమ్మ గురించే కబుర్లు. ఏ టివీలో చూసినా ఈ అందాల సుందరి సందడే సందడి. ఇంతకీ ఎవరీ తాప్సీ?ఎందుకీమెకింత క్రేజ్, తెలుగు సినిమాల్లో ఇంతమంది అందాల సుందరాంగులుండగా ఈమే ఎందుకు సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతోంది. కొత్తొక వింత, పాతొక రోగ. సినిమా హీరోయిన్ల విషయంలో ఇది నూటికి నూరుపాళ్లూ నిజం. కొత్త హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది.

ఎవరా అమ్మాయి?ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా ఉంది?ఇవీ డిస్కషన్ టాపిక్స్. టాలీవుడ్ లో తాప్సీ చేసింది ఒకే ఒక్క సినిమా, కానీ తాప్సీ హడావిడి అంతా ఇంతా కాదు. పంజాబ్ లోని లుథియానా ఈమె నేటివ్, అసలు పేరు తాప్సీ పన్ను, వయస్సు21, క్వాలిఫికేషన్ బి.టెక్ 2008లో మిస్ ఇండియా ఫైనల్స్ వరకూ వెళ్ళింది తాప్సీ. ప్రెష్ ఫేస్ బ్యూటిఫుల్ స్కిన్ టైటిల్స్ గెలుచుకొని హవా చూపించింది. ఆ తర్వాత మోడలింగ్, రెడ్ ఎఫ్.యమ్ యాడ్ తో తాప్సీ ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసింది. ఈ అడ్వర్ టైజ్మెంట్ ఈమెను సౌత్ లో బాగా పాపులర్ చేసింది.

కామన్ గానే యాడ్స్ తర్వాత సినిమాలు ఇలా కెరీర్ ని పక్కాగా ప్లాన్ చేసుకుంది తాప్పీ. అయితే ఈ ఉత్తరాది భామ దక్షిణాది పై మనసుపడింది. తమిళంలో తొలి సినిమా ఒప్పుకుంది అది రిలీజ్ కాకముందే ఝుమ్మందినాధంతో ఈమెకు టాలీవుడ్ లో రాఘవేంద్రరావు తనదైన ట్రెడ్ మార్క్ తో గ్రాండ్ ఎంట్రీ ఇప్పించాడు. ఈ సినిమాతో టాలీవుడ్ కి ఓ సరికొత్త అందాల రాశి పరిచయమైంది. సినిమా రిలీజ్ కి ముందు ఎంత హడావిడి చేసిందో..తెరపై కూడా తాప్సీ సూపర్స్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu