For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూల్ గా..మందు కొడుతూ ఫోజులచ్చింది (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్ : మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫొటో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. స్నేహ ఉల్లాల్ కు చేతిలో సినిమాలు లేవు కానీ ఇలా చేతిలో గ్లాసు పట్టుకుని ఆల్కహాల్ తో స్టిల్స్ ఇస్తూ సంచలనం రేపటం మాత్రం తెలుసు. పిల్లి కళ్ళ సుందరిగా పేరు పడ్డ ఈమె తెలుగులోనూ చాలా చిత్రాలు చేసింది. మడతకాజా, అలా మొదలైంది సినిమా తర్వాత నడుంకు సంభందించిన సమస్యతో గ్యాప్ తీసుకుంది ఆమె. దాంతో ఇలా కెమెరాకు మందు కొడుతూ ఫోజ్ లు ఇచ్చింది. అలాగని ఇదేమీ మందు ప్రకటనకు సంభందించింది ఏమీ కాదండోయ్..కుటంబ సబ్యులతో కూడిన పార్టీట అది. అంతేకాదు తాను మొదటి సారి మందు కొడుతున్నానంటూ చెప్పుకొచ్చింది. అదీ మ్యాటర్.

    అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్ లో ఐశ్వర్యా రాయ్ లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

    తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్ లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది.

    HOT Sneha Ullal's First Glass Of Alcohol

    సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా ఉంటానని అంటోంది.

    తెలుగులో కరెంట్‌, సింహా తదితర చిత్రాల్లో కనిపించిన స్నేహా ఉల్లాల్‌కి తమిళ చిత్రాల్లో నటించే ఛాన్సు లభించిందీ ఆ మధ్య. 'వేదం' చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మిస్తుంటే అందులో శింబు సరసన నటిచింది. అయితే ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు.

    English summary
    Sneha Ullal is here now, sending waves in film circles as she poses to cameras with her first ever 'alcohol' drinking mania.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X