Don't Miss!
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్‌పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గుర్తుపట్టారా...ఈ హీరోయిన్ ఎవరో(ఫొటో)
హైదరాబాద్ : మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండంటూ ప్రశ్నిస్తూ పోస్ట్ చేస్తున్నారు. దాంతో ఇంటర్ నెట్ సైట్స్ లో సైతం దీనికి ప్రాముఖ్యత వచ్చింది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తు పట్టారా..ఈమె మరోవరో కాదు స్నేహా ఉల్లాల్. పిల్లి కళ్ళ సుందరిగా పేరు పడ్డ ఈమె తెలుగులోనూ చాలా చిత్రాలు చేసింది. ఈమె రీసెంట్ గా ఓ హాలోవిన్ పార్టీకి హాజరవటానికి ఇలా రెడీ అయ్యింది. అలా మొదలైంది సినిమా తర్వాత నడుంకు సంభందించిన సమస్యతో గ్యాప్ తీసుకుంది ఆమె.
అచ్చం అలనాటి అందాల నటి మందాకినిలా, కొన్ని యాంగిల్స్ లో ఐశ్వర్యా రాయ్ లా కూడా ఉండి, తెలుగులో సింహా, ఉల్లాసంగా ఉత్సాహంగా లాంటి సినిమాలతో కొద్దిపాటి హిట్లు సాధించి.. ఇప్పుడు అంతగా మార్కెట్ లేని స్నేహా ఉల్లాల్.. మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.
తొలిసారి హిందీలో ఆమెకు అవకాశం కల్పించిన బాలీవుడ్ బ్రహ్మచారి సల్మాన్ ఖానే ఇప్పుడు కూడా ఆమెకు మరో చాన్సు ఇస్తున్నాడు. 'లక్కీ.. నో టైం టు లవ్' అనే చిత్రంలో స్నేహా ఉల్లాల్ తొలిసారి హిందీతెరపై కనిపించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. లక్కీ సినిమా నాటినుంచే సల్మాన్ ఖాన్ తనతో టచ్ లోనే ఉన్నారని, అప్పటికి సినిమాలంటే తనకు భయం పోలేదు గానీ ఇప్పుడైతే బాగా అనుభవం వచ్చింది కాబట్టి, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉన్నానని స్నేహా ఉల్లాల్ చెప్పింది.
సినిమాల్లో బాగా ఆకర్షణీయంగా కనిపించాలని సల్మాన్ చెప్పాడని, జిమ్ ఎలా చేయాలో చెప్పడమే కాక, బెల్లీ డాన్సు కూడా నేర్చుకోవాలని సూచించాడని తెలిపింది. ఇప్పటికి కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అనుభవం ఉంది కాబట్టి, ఇక మీదట సినిమాలు ఎంచుకునేటప్పుడ జాగ్రత్తగా ఉంటానని అంటోంది.
తెలుగులో కరెంట్, సింహా తదితర చిత్రాల్లో కనిపించిన స్నేహా ఉల్లాల్‌కి తమిళ చిత్రాల్లో నటించే ఛాన్సు లభించిందీ ఆ మధ్య. 'వేదం' చిత్రాన్ని తమిళంలో పునర్నిర్మిస్తుంటే అందులో శింబు సరసన నటిచింది. అయితే ఆ సినిమా కూడా వర్కవుట్ కాలేదు.