ఎన్టీఆర్ పక్కనుంటే ఆ లెక్కే వేరు..ఇలియానా
ఎన్టీఆర్ పక్కనుంటే ధైర్యంగా వుంటుంది. ఆయనతో మరో సారి నటించడం హ్యాపీగా వుంది అంటోంది ఇలియానా. అలాగే ఎన్టీఆర్ తను ఎక్కడున్నా తన గురించే కాదు...పక్కవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాడు. సెట్స్‌లో ఎంతో ఎనర్జిటిక్‌గా వుంటాడు. ఎవ్వరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేస్తాడు. 'రాఖీ'లో ఓ పాట షూటింగ్ కోసం పుకెట్ వెళ్ళాం. అక్కడ ఓ దీవిలో నన్ను తన భుజాలపై వేసుకుని తీసుకెళ్లే సీన్ వుంది. అది నేను చేయటానికి చాలా భయపడ్డాను. కాని అప్పుడు నాలో తారక్ ధైర్యాన్ని నింపాడు. తారక్ గుర్తుకు రాగానే ఆ సన్నివేశమే గుర్తొస్తుంది' అంటూ ఎన్టీఆర్‌తో గుర్తు చేసుకుంది ఇలియానా. ఎన్టీఆర్ తో 'రాఖీ' చిత్రంలో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ మళ్ళీ ఎన్టీఆర్ తో కలిసి 'శక్తి' చిత్రంలో నటిస్తున్నారు. వినోద ప్రధానంగా సాగే శక్తి చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నానని చెప్తూ మురిసిపోతోంది ఆమె. ఇక ఇలియానా రీసెంట్ గా చేసిన రెచ్చిపో, సలీం చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ నమోదు చేయటం ఆమెను భాదించిందని చెప్పింది.


Click it and Unblock the Notifications











