రొమాంటిక్ పర్సన్ అయ్యుండాలి: ఇలియానా
నాక్కాబోయే భర్త అందగాడు కానక్కర్లేదు. మంచి రొమాంటిక్ పర్సన్ అయ్యుండాలి. అబద్ధాలకోరు అస్సలు అయ్యుండకూడదు. ముప్పై దాటక ముందే పెళ్ళి చేసుకుంటానని చెప్పిన ఇలియానా ఆమెకు కావాల్సిన అబ్బాయి ఎలా ఉండాలో మీడియాకు వివరించింది. ఆమె మాటల్లోనే...నేను పెద్ద స్టార్ ని అయినా..అందరు అమ్మాయిల్లా నాక్కూడా పెళ్లి విషయంలో కొన్ని కచ్ఛితమైన అభిప్రాయాలున్నాయి. అలాగే ఓ మంచి పనికోసం అబద్ధం ఆడటంలో తప్పులేదు. కానీ అనవసరంగా అబద్ధాలు అడేవారంటే నాకు మంట. సెన్సాఫ్ హ్యూమర్ గల వ్యక్తి అయ్యుండాలి. జాలి, క్షమ గుణాలు గలవాడై ఉండాలి. ఈ లక్షణాలున్న అబ్బాయినే చేసుకుంటా' అంది ఇలియానా. ప్రస్తుతం ఇలియానా...ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో చేస్తోంది. మెహర్ రమేష్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం వైజయంతి మూవీస్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.
ఇలియానా దేవదాసు రెచ్చిపో సలీం విష్ణు వర్ధన్ వైవియస్ చౌదరి ileana devadas vishnuvardhan babu rechipo ashwini dutt


Click it and Unblock the Notifications