తమన్నా వెరైటీ నిక్ నేమ్ వెనక కథ
హ్యాపీ గర్ల్ తమన్నాకి బోల్డు ముద్దు పేర్లు ఉన్నాయి. ఆమెను బాగా దగ్గరవాళ్లు ముద్దుగా 'తమ్మూ' అనీ 'తమ్స్' అనీ పిలుస్తుంటారు. అలాగే ఆమెకు స్కూల్ డేస్‌లో 'తాళ్' నిక్ నేమ్ ఉండేది. ఇప్పటికీ ఆమె స్కూల్ స్నేహితులందరూ ఆమెను 'తాళ్' అని పిలుస్తూంటారు. ఇక ఈ పేరు ఎలా వచ్చిందీ అంటే ఆమె ఓ చిన్న ప్లాష్ బ్యాక్ చెప్తోంది. స్కూల్లో చదువుకునేటప్పుడు అక్కడ స్కూల్ పంక్షన్ లో తమన్నా డాన్స్ పోగ్రామ్ ఇవ్వాలని అనుకుందట. మంచి జోష్‌గా ఉన్న పాట అయితే బాగుంటుందని 'తాళ్' సినిమాలో ఐశ్వర్య రాయ్ అద్భుతమైన నృత్యప్రదర్శనతో ఆకట్టుకున్న 'తాళ్ సే తాళ్ మిలా...'పాటని ఎన్నుకుంది. బాగా ప్రాక్టీస్ చేసి మొత్తానికి స్టేజీపై అచ్చంగా ఐశ్వర్యరాయ్‌లా అభినయించింది. దాంతో తమన్నాకి ఆమె స్నేహితులు 'తాళ్' అని పేరు పెట్టేశారు. అలాగే ఐశ్వర్య రాయ్ అని కూడా పిలిచేవారు. అంటూ ఇటీవల ఓ సందర్భంలో ఈ సంఘటనని తమన్నా స్కూల్ డేస్ ని గుర్తు చేసుకుంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తమిళంలో చేసిన మూడు చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. తెలుగులోనూ పెద్ద బ్యానర్ ఒక దానిలో సినిమా ఉందని ఆమె చెప్తోంది.


Click it and Unblock the Notifications











