twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా సినీ రంగ ప్రవేశం ఎలా జరగిందంటే...తాప్సీ

    By Srikanya
    |

    ఝుమ్మంది నాదం చిత్రం ఫెయిల్యూర్ అయినా ఈ చిత్రం ద్వారా పరిచయమైన తాప్సీ మాత్రం బిజీ అయిపోయింది.అయితే ఆమె సినీ రంగ ప్రవేశం మాత్రం విచిత్రంగా జరిగిందని,తాను అస్సలు హీరోయిన్ అవుతానని కలకూడా కనలేదని చెప్తోంది. ఆమె మాటల్లోనే..సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన నేను ఎంబీఏ కూడా చేయాలనుకున్నా. కానీ మోడలింగ్‌ రంగంలో ఛాన్సు రావటంతో అది కాస్త మూలన పడింది. రెడ్ ఎఫ్ ఎం వంటి సంస్ధలకు మోడలింగ్‌ చేస్తున్న సమయంలో కోఆర్టినేటర్ల ద్వారా నా ఫోటోలు తెలుగు నిర్మాతల చేతుల్లో పడ్డాయి. దాంతో ఇక్కడ తెలుగు తెరపై కనిపించే అదష్టం దక్కింది. హీరోయిన్‌ గా నటిస్తానని నేనెప్పుడు అనుకోలేదు. కానీ ఒక హీరోయిన్‌కు ఉండాల్సిన లక్షణాలు నీలో పుష్కలంగా ఉన్నాయంటూ నా ఫ్రెండ్స్‌ నన్ను ప్రోత్సహించారు. ఇంజినీర్‌ గా కన్నా కూడా సృజనాత్మక రంగంలోనే నేను బాగా రాణిస్తానని నాకు తెలుసు. అందుకే ఇక్కడే సెటిల్ అయిపోయాను అని తాప్సీ వివరించింది. ప్రస్తుతం తాప్సీ...విష్ణు సరసన వస్తాడు నా రాజు చిత్రంలోనూ, ప్రభాస్ సరసన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రంలోనూ చేస్తోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X