For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకిస్తున్న సన్నిలియోన్ బికిని కొత్త స్టిల్స్ (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఒక్కసారి ఇండియాలో హాట్ టాపిక్ గా మారిన భామ సన్నీలియోన్. తనను మర్చిపోతున్నారనుకుందో ఏమో కానీ .. రీసెంట్ గా ఆమె బికినీ వేసుకుని..ఫోటో షూట్ చేయించుకుని హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మర్డర్ 3 చిత్రం కోసం రెడీ అవుతున్న ఈ భామ బాలీవుడ్ లో హాట్ ఫేవెరెట్ గా మారింది. ఆ బికినీ షూట్ ఫోటోలు మీ కోసం...

  ప్రస్తుతం సన్నీ లియోన్‌ తన రెండో సినిమా కోసం శిక్షణ శిబిరాల్లో పాల్గొంటోంది. 2011లో వచ్చిన 'రాగిణి ఎం.ఎం.ఎస్‌' చిత్రానికి కొనసాగింపుగా ఓ చిత్రం రాబోతోంది. ఇందులో ప్రధాన పాత్రకు సన్నీ లియోన్‌ని ఎంపిక చేసుకున్నారు. భూషణ్‌ పటేల్‌ దర్శకుడు. ఏక్తాకపూర్‌ నిర్మాత.

  నటిగా తొలి అడుగులు వేసేటప్పుడు శిక్షణ తీసుకోవడం సాధారణమే. అయితే ఈ చిత్రంలో సన్నీ భిన్నమైన భావోద్వేగాల్ని పలికించాల్సి ఉందట. అయితే ఆమెకి వాణిజ్యపరమైన చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. హావభావ ప్రకటనలో ఇబ్బందులు ఎదురు కాకుండా ఆమె కోసం శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్రంకు క్రేజ్ తేవటంలో భాగంగానే ఈ ఫోటో షూట్ ని ఏర్పాటు చేసారని బాలీవుడ్ సమాచారం.

  సన్నీ లియోన్‌ చెబుతూ ''గతంలో పూజా భట్‌ దర్శకత్వంలో 'జిస్మ్‌-2' చిత్రంలో నటించాను. అయితే ఆ సినిమాకు ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. పూజాభట్‌ సహకారంతో నటించాను. ఇప్పుడు 'రాగిణి ఎం.ఎం.ఎస్‌-2'లో మాత్రం నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు. భావోద్వేగాల్ని ఆవిష్కరించాలి. అందుకే ప్రత్యేకంగా శిక్షణ అవసరమైంది''అని తెలిపింది.

  సన్ని లియోన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఆమె ఫోర్న్ స్టార్ ఇమేజ్ ఆమెను వదలటం లేదు. దాంతో ఆమెను తమ సినిమాల్లో చేయటానికి ఓ మాదిరి హీరోలు కూడా ఒప్పుకోవటం లేదు. సన్నిలియోన్ తో చేస్తే తమ సినిమాలకు ప్యామలీ ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. మహేష్ భట్ క్యాంప్, ఏక్తా కపూర్ తప్ప.. సన్నిలియోన్ తో చేసే ధైర్యం చేయటం లేదు. అయితే తాను బాలీవుడ్ లో సెటిల్ అవ్వటానికే వచ్చానని సన్ని చెప్పటం విశేషం.

  ‘జిస్మ్-2' చిత్రంతో పరిచయమైన ఈ ఫోర్న్ స్టార్.. అందచందాల ప్రదర్శనతో బాలీవుడ్ వేడిక్కిపోయింది. నటనకన్నా ఆమె శరీరంపైనే కెమెరాల దృష్టి. అది గమనించిన ఈ ముద్దుగుమ్మ ఇలా తను కేవలం ఫోర్న్ స్టార్ ని కాదు భారతీయ సంస్కృతిలో కూడా కలిసిపోగలని చెప్తోంది.

  తానేమీ వ్యభిచారిని కాదని, ఫోర్న్ స్టార్ అంటే అర్దం వ్యభిచారం చేసే వాళ్లు కాదని సన్నిలియోన్ మీడియా వాపోతోంది. ఆమెను జనం తప్పు పడుతున్నారని, ఇక్కడు ఇండియాలో తనను సరిగా అర్దం చేసుకోకుండా మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె అంటోంది.

  తన తల్లి తండ్రులు పంజాబ్ కి చెందిన వారే నని తాను ఇండియాకు చెందిన దాన్ని అని పదేపదే చెప్తోంది. తాను ఫోర్న్ ఇండస్ట్రీలోకి కావాలని వెళ్లలేదని, కానీ డబ్బు సంపాదించటానకి అదో మంచి మార్గం అని తెలిసాక వెళ్లకుండా ఉండలేకపోయాను అని తనను తాను సమర్ధించుకుంటూ, తనను ఆ కోణంలోనే చూడాలని రిక్వెస్టు చేస్తోంది.

  మొదట తన తల్లితండ్రులు ఫోర్న్ స్టార్ గా మారతానంటే వ్యతిరేకించారు కానీ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి, తనను దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను మర్డర్ 3లో నటిస్తున్నానని, ఆ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నానని చెప్పుకొచ్చింది.

  నేను బిగ్ బాస్ కంటిస్ట్ లో అడుగుపెట్టాక.. ఒక్క అడల్డ్ ఫిల్మ్ లో కూడా నటించలేదు. అలాగని నేను అడల్ట్ ఇండస్ట్రీ నుంచి వైదలుతున్నట్లు కాదు. నేను ఎప్పటికి అలా చేయను కాక చేయను. ఎందుకంటే నేను నా రూట్స్ ని ఎప్పటికీ మర్చిపోలేను. బాలీవుడ్ ఎప్పటికీ నాకు ఆఫర్స్ పరంగా గ్యారెంటీ ఇవ్వలేదు అంటోంది సన్నిలియోన్. అలాగే తనకున్న ఫోర్న్ ఫ్యాన్స్ ని ఫాలోయింగ్ ని నిరాశపరచలేనని ఖచ్చితంగా చెప్పేసింది.

  నేను ఎప్పుడూ ఫోర్న్ ఇండస్ట్రీలో ఉన్నానని సిగ్గు పడను అంది నిజానికి నేను డెడికేటెడ్ ప్రొపిషనల్ గా ఈ జాబ్ ని చేయటానికి చాలా ఇష్టపడతాను. నా సన్ లస్ట్ ప్రొడక్షన్స్ కంపెనీ కూడా కంటిన్యూగా ఫోర్న్ సినిమాలు తీయటంలో బిజీగా ఉంది. నేను ఆ టీమ్ తో అశోసియేట్ అవుతూనే ఉంటాను అంటూ తన వృత్తి పట్ల ఆమెకు ఉండే నిబద్దత వెళ్లడించింది.

  ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ప్రయత్నాలు చేస్తూనే ఓ ఫోర్న్ సినిమా నిర్మిస్తోంది. ఆ సినిమా తన అభిమానులను గ్యారెంటీగా సంతృప్తి పరుస్తుందని హామీ ఇస్తోంది.

  సన్నీ లియోన్‌తో తెలుగులో ఓ సినిమా చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తెలుగులో రూపొందించి దక్షిణాదిన ఇతర బాషల్లో అనువాదం చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయని భావిస్తున్నారు. ఈ మేరకు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇంకా సన్నిలియోన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.

  రీసెంట్ గా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 రాత్రి డాన్స్ చేసి... ఒక్క రాత్రికి కోటి రూపాయలు రేటు వసూలు చేస్తూ షాక్ ఇచ్చింది.

  2012 సంవత్సరంలో సన్నీ లియోన్ ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల లిస్టులో టాప్ ప్లేస్ సంపాదించుకుంది.

  English summary
  There's no doubt about the fact that Sunny Leone is a true beauty. The girl is certainly blessed with a lovely face a hot bod.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X