‘మొగుడు’ పై ఆశలు పెంచుకుంటోన్న హాట్ తాప్సీ...!
'ఝుమ్మంది నాదం" సినిమా ద్వారా సౌత్ సినిమాల్లో ఆరంగ్రేటం చేసిన తాప్సీ ఆ సినిమా పెద్దగా విజయంసాధించక పోయినా హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. సెంకండ్ హీరోయిన్ పాత్రలు చేయడానికి వెనకాడకుండా...మెల్లి మెల్లిగా తన ప్రాభవాన్ని పెంచుకుంది. తద్వారా మెయిన్ హీరోయిన్ పాత్రలను చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం తాప్సీ టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఇప్పటికే ఆమె నటించి వచ్చాడు-గెలిచాడు తెలుగు, తమిళ వర్షన్ లలో విడుదల కాగా, తెలుగులో కృష్ణవంశీ రూపొందిస్తున్న 'మొగుడు" చిత్రంలో గోపీచంద్ సరసన లీడ్ రోల్ చేస్తోంది. ఈ చిత్రం పై తాప్పీ చాలానే హోప్స్ పెట్టుకొంది.
'ప్రణయ బంధాన్ని పరిణయంతో వైవాహిక బంధంగా మార్చుకొని తమదైన కలల ప్రపంచంలోకి అడుగుపెడతారు ప్రేమికులు. అక్కడి నుంచి భార్యాభర్తలుగా వారిని ఎన్నో బాధ్యతలు చుట్టుముడతాయి. అయితే చక్కటి అవగాహన కలిగిన దంపతులు వారి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. అలాంటి అన్యోన్యమైన దంపతుల కథాంశంతో కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం 'మొగుడు". గోపిచంద్, తాప్సీ జంటగా నటిస్తున్నారు. శ్రద్దాదాస్ మరో కథానాయికగా నటిస్తోంది. లక్ష్మినరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ జరుగుతోంది. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ' రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో కృష్ణవంశీది ప్రత్యేకశైలి.
వినోదం, ప్రణయం, శృంగారం ప్రధానాంశాలుగా సున్నితమైన భావోద్వేగాలతో కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. భార్యాభర్తల అనుబంధానికి సిసలైన నిర్వచనంలా ఈ చిత్రం వుంటుంది. ఆగస్టులో మారిషస్‌లో జరిపిన భారీ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించాం. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో పతాక సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో రెండు పాటలు మినహా సినిమా మొత్తం పూర్తయింది. ప్రస్తుతం మిగిలిన రెండు పాటల్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నాం. అక్టోబర్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు. నరేష్, రోజా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











