బాబోయ్...తాప్సీకి దెయ్యం పట్టింది

By Srikanya

హైదరాబాద్ : తాప్సీ కి దెయ్యం పట్టిందని అంటున్నారు అంతా. ఆమె ఇప్పుడు ఎవరితో మాట్లాడినా దెయ్యాల గురించే డిస్కస్ చేస్తోందిట. తాను విపరీతంగా దెయ్యాలనూ నమ్ముతానని స్టేట్ మెంట్స్ ఇస్తోంది తాప్సీ. హర్రర్ చిత్రం 'ముని-3' లో చేస్తున్న ఆమెకు ఆ సినిమా ఇన్ఫూలియన్స్ బాగానే పడింది. దాంతో అదే గొడవలో ఉండటంతో ఆమెకు దెయ్యం పట్టిందంటున్నారు.

తాప్సీ మాట్లాడుతూ.. నేను గతంలో ఎన్నో హర్రర్‌ చిత్రాలు చూశాను. ఆ తరహా సినిమాలో నటించనుండటం థ్రిల్లింగ్‌గా ఉంది. నాకు దేవుడిపై నమ్మకముంది. అదే సమయంలో దెయ్యాలను కూడా నమ్ముతాను. 'కాంచన'లానే 'ముని-3' కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపింది . సూపర్ హిట్ 'కాంచన'కు సీక్వెల్ గా రూపొందుతున్న 'ముని-3'లో రాఘవా లారెన్స్‌తో ఆడిపాడుతోంది.

శ్రీ గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మల్టీ డైమన్షనల్ అధినేత రజిత్ పార్థసారథి సమర్పణలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 'కాంచన' సినిమా సమయంలోనే తన బ్యానర్ లో ఓ సినిమా చేసిపెడతానని లారెన్స్ తనకి మాట ఇచ్చారనీ, దానిని ఇప్పుడిలా నిలబెట్టుకున్నారని చెప్పారు. 'కాంచన' సినిమా తనకి మంచి లాభాలు తెచ్చి పెట్టిందనీ, అలాగే ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకముందని అన్నారు.

దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ.... ఈ చిత్రం కాంచన తరహాలోనే ఎంటర్‌టైన్ చేస్తుందని, ఓ వైపు నవ్విస్తూనే... భయపెడుతుందని చెప్పుకొచ్చారు. లారెన్స్, తాప్సీ, బ్రహ్మానందం, శ్రీమాన్, అలీ, కోవై సరళ నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కృష్ణ స్వామి, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X