'మేము సైతం' పోగ్రాం మిస్ అయ్యానంటూ...

By Srikanya

హైదరబాద్‌: టెంప్టింగ్ బ్యూటీ తాప్సీ తాను మేము సైతం పోగ్రాంలో పాల్గొనలేకపోతున్నందుకు బాధ పడింది. తాను షూటింగ్ లో ఉండిపోవటం వల్ల రాలేకపోయానని ట్వీట్ చేసి తెలిపింది. ఇప్పటికీ తాను షూటింగ్ లో ఉన్నానని ..11 గంటలు నుంచి కంటిన్యూగా షూట్ లో పాల్గొంటున్నట్లు తెలియచేసింది.

ఇక హుదు హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన మేము సైతం కార్యక్రమం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనంత శ్రీరామ్‌ రచించి, సంగీత దర్శకుడు కోటి స్వరపరిచిన మేము సైతం... గీతాన్ని పలువురు గాయకులు ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సినీ నటులు బాలకృష్ణ, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేష్‌, మురళీమోహన్‌, మంచు విష్ణు, దర్శకులు దాసరినారాయణరావు, రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్‌, సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇక ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ... గతంలో విపత్తులు సంభవించినప్పుడు చిత్ర పరిశ్రమ ద్వారా అందించిన సాయం వివరాలను గుర్తు చేశారు. 1977 దివిసీమ ఉప్పెన సమయంలో, రాయలసీమ కరవు సమయంలో చిత్ర పరిశ్రమ పలుకార్యక్రమాలు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించిందన్నారు.

Hot Tapsee apologises to Memu Saitham team

తుపాను బాధితుల కోసం అప్పట్లో ఎన్టీఆర్‌ జోలెపట్టి విరాళాలు సేకరించారని గుర్తు చేశారు. సినీనటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... తుపాను బాధితుల సహాయం కోసం కళాకారులు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చినప్పటికీ, చిత్ర పరిశ్రమ ద్వారా అందరం కలిసి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని పి.సుశీల బాధితుల కోసం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించారు.

'ఝుమ్మందినాదం'తో వెండితెరకు పరిచయమైన తాప్సి తొలి నుంచి గ్లామర్‌ పాత్రలే పోషిస్తూ వచ్చింది. మధ్యలో 'గుండెల్లో గోదారి' వంటి నటనా ప్రాధన్యమున్న పాత్రలు కూడా చేసింది. ఈ సమయంలో సరైన విజయాలు అందుకోలేకపోయినా ఎప్పుడూ నిరాశ పడలేదు. మీ తోటి హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మీరేంటి వెనుకబడిపోయారు అని ఎవరన్నా అంటే ఇలా సమాధానమిస్తోంది.

''నాకు మంచి పాత్రలు కావాలి. ఆ పాత్రలను తల్చుకుంటే తాప్సి గుర్తుకు రావాలి. ఏదో సినిమాలు చేసేశాం, నాలుగు రాళ్లు వెనకేసుకున్నాం అనే పద్ధతి కాదు నాది'' అంటూ గట్టిగానే చెప్పేది. తాప్సి ప్రస్తుతం 'ముని3: గంగ', తమిళంలో 'వాయ్‌ రాజా వాయ్‌'లో నటిస్తోంది. ఆమె హిందీలో చేసిన రెండో చిత్రం 'రన్నింగ్‌ షాదీ డాట్‌ కామ్‌' త్వరలో విడుదల కాబోతోంది. మరి బాలీవుడ్‌లోనూ తాప్సి ఇదే మంత్రాన్ని పఠిస్తుందా అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X