జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ తాప్సీ(ఫొటో)
హైదరాబాద్ : జీరో సైజు మోజు మెల్లిమెల్లిగా హీరోయిన్స్ తగ్గుతోంది. శరీరం ఫిట్ గా ఉంచుకోవాలని ఆలోచనలో జిమ్ బాట పడుతున్నారు. తాప్సీ కూడా అదే దారిలో ప్రయాణం పెట్టుకుంది. ఇదిగో ఇలా జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ చెమటోడుస్తోంది. శరీరం ఫిట్ గా ఉండి,గ్లామర్ గా ఉంటే ఆఫర్స్ వాటంతట అవే వస్తాయంటోంది. తెలుగులో ఆఫర్స్ అసలు లేని ఈమెకు ఈ లుక్ లో అయినా ఏ హీరో దృష్టి అయినా పడుతుందేమో చూద్దాం.
తాప్సీ కెరీర్ విషయానికి వస్తే...
సాధారణంగా హీరోలు ఒక సినిమా తర్వాతే మరొక సినిమా గురించి ఆలోచిస్తుంటారు. హీరోయిన్స్ మాత్రం అలా కాదు. ఒకేసారి నాలుగైదు సినిమాలకు సంతకాలు చేస్తుంటారు. అవకాశం వస్తే రెండు మూడు భాషల్లోనూ తమ జోరును చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఎలాగో కథల్లో వారి పాత్రలకు ప్రాధాన్యం తక్కువ కాబట్టి చకచకా పని పూర్తి చేసి సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకొంటుంటారు. ఆ సంఖ్యను చూపిస్తూ నా క్రేజ్ ఇదీ అని చెప్పకనే చెబుతుంటారు. ఒకప్పుడు తాప్సి అలాగే హల్‌చల్ చేసింది.

ఇటీవల మాత్రం ఆమె ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఇదివరకే పూర్తి చేసిన మూడు చిత్రాల విడుదల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అవి విడుదలయ్యాకే కొత్త సినిమాలు ఒప్పుకొంటారా? అని అడిగితే తెలివిగా సమాధానమిచ్చిఅడిగిన వారిని అవాక్కయ్యేటట్లు చేసింది. హిందీలో అక్షయ్‌కుమార్ సరసన 'బేబీ'లో నటిస్తోంది.
తాప్సీ మాట్లాడుతూ...''అలా ప్రత్యేకంగా సమయం అంటూ ఏమీ నిర్దేశించుకోను. మంచి కథ అనుకొంటే ఎప్పుడైనా ఒప్పుకోవచ్చు. నన్ను ఉత్తేజితం చేసే కథ రావాలన్నదే నా అభిప్రాయం. అంతవరకు ఖాళీగానైనా ఉండొచ్చు కానీ ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించకూడదు అనేది నా సిద్ధాంతం. చేతిలో ఎన్ని సినిమాలుంటే ఏం లాభం? ప్రయాణాన్ని మలుపు తిప్పే ఒక్క కథ చాలు. ఇప్పుడు అలాంటి కీలకమైన సినిమాలోనే నటిస్తున్నాన''ని చెప్పుకొచ్చింది తాప్సి.


Click it and Unblock the Notifications











