అవార్డులు రాకపోతే నాలో ప్రతిభలేనట్లా?
''అవార్డులు ఆత్మవిశ్వాసం పెంచుతాయి. మన కష్టాన్ని పరిశ్రమ గుర్తించడం కంటే ఆనందం ఏముంటుంది? అయితే అవి రానంత మాత్రాన ప్రతిభ లేనట్టు కాదు కదా. కేవలం అవార్డుల కోసమే సినిమాలు చేయడం తప్పు. 'నీ నటన బాగుంది' అని మా అమ్మ నవ్వుతూ చెబితే అదే నాకు ఆస్కార్ అవార్డుతో సమానం'' అంటోంది తాప్సీ. నిన్న ఆవార్డులు వచ్చిన సందర్బంగా కలిసిన మీడియాతో ఆమె ఇలా స్పందించింది. అలాగే..అవార్డులు, ప్రశంసలు, పురస్కారాలు... ఇవేమీ ఇవ్వలేని సంతృప్తి ఒక్కటుంది. అదే మా అమ్మ చిరునవ్వు అని తేల్చి చెప్పింది.
ఇక తాప్సీ ప్రస్తుతం వెంకటేష్ 'షాడో', రవితేజ 'దరువు' చిత్రాల్లో ఈ భామ నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఇక తాప్సీ దృష్టి మొత్తం రవితేజతో చేస్తున్న 'దరువు' సినిమా పైనే ఉంది.'సౌండ్ ఆఫ్ మాస్' అనేది ట్యాగ్ లైన్ తో రెడీ అవుతున్న ఈ చిత్రంలో తాప్సి హీరోయిన్ గా చేస్తోంది. శౌర్యం శివ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ మాట్లాడుతూ ''రవితేజ శైలిలో సాగే చిత్రమిది. యాక్షన్ అంశాలు జోడించాం. ఆయన పాత్ర విభిన్నమైన కోణాల్లో కనిపిస్తుంది. సినిమాను తొందరగా పూర్తి చేసి వేసవికి విడుదల చేయాలనుకొంటున్నాము''అన్నారు. జయసుధ, బ్రహ్మానందం, సాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్ సింగ్, సన, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్నారు. సంగీతం: విజయ్ ఆంథోని.


Click it and Unblock the Notifications











