అందరి దృష్టి ఆ..సెక్సు సినిమాపైనే
శృంగార(సెక్సు) సంబంధమైన చర్చలు, శృంగార ప్రధానమైన చిత్రాలు వంటివి వచ్చినప్పడు అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ప్రేక్షకుల్లో, యువతలో ఆ అంశంపై ఉన్న ఆసక్తి అలాంటి మరి. తాజాగా ఓ మలయాళ శృంగార ప్రధామైన సినిమా తెలుగులో అనువాదం అవుతుండటంతో సినీ వర్గాల్లో ఆ సినిమాపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
మలయాళంలో రూపొందిన 'రతి నిర్వేదం" సినిమా తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. తనకు తెలియకుండానే తనకన్నా పెద్దదయిన అమ్మాయి ఆకర్షణకులోనైన అబ్బాయి, తనకన్నా చిన్నవాడి ఆకర్షణ నుంచి తప్పించుకోలేక సతమతమయ్యే అమ్మాయి...ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే అంశాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. అబ్బాయి పాత్రలో శ్రీజిత్ నటించగా, అమ్మాయి పాత్రను శ్వేతామీనన్ పోషించారు. ఈ చిత్రానికి రాజీవ్ కుమార్ దర్శకత్వం వహించారు.
1978లోనే 'రతినిర్వేదం" సినిమా వచ్చింది. అప్పుడు ఆ సినిమాలో జయభారతి నటించగా భారీ విజయం సాధించింది. తాజాగా రతినిర్వేదం రీమేక్ లో శ్వేత మీనన్ శృంగార రసాన్ని సరికొత్త రీతిలో ప్రేక్షకులపై ఒతికించేందుకు సన్నద్ధమైంది. ఈ సినిమా తెలుగు అనువాద హక్కులను యస్.వి.ఆర్. మీడియా సంస్థ దక్కించుకుంది.


Click it and Unblock the Notifications











