హాట్ టాపిక్: మహేష్ బాబు బంధు ప్రీతి!
బంధు పక్షపాత ధోరణి రాజకీయాలతో పాటు, సినిమా రంగంలోనూ వెరీ కామన్. రాజకీయాల్లో అయినా....సినిమా రంగంలో అయినా బంధువుల సపోర్టు ఉంటే ఓరేంజ్‌కి ఎదిగి పోవచ్చు. అయితే ఇందులో కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు.
అయితే మహేష్ బాబు కొత్తగా అనుసరిస్తున్న బంధు ప్రీతి వ్యవహారం మాత్రం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశం అయింది. మహేష్ బాబు సాధారణంగా తన సినిమా ఫంక్షన్లు, తనకు డబ్బు సంపాదించి పెట్టే వాణిజ్య ప్రకటనలు మినహా.....ఏ ఇతర సినిమా ఫంక్షన్లలోనూ, తెలుగు సినీ సినీ పరిశ్రమకు చెందిన ఎలాంటి కార్య్రకమాల్లోనూ కనిపించనే అపవాదు ఎప్పటి నుంచో ఉంది. పైగా మహేష్ బాబు ఇతర హీరోలతో కలివిడిగా ఉన్న సందర్భాలు అస్సలు లేనే లేవు. దీని తోడు తనకు పరిశ్రమలో ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటూ మహేష్ బాబు అ మధ్య చేసిన ప్రకటన కూడా ఆ మధ్య చర్చనీయాంశం అయింది. కొందరు మనుషులు, కొన్ని జీవితాలంతే....అంటూ పరిశ్రమకు చెందిన చాలా మంది అనేక సార్లు సరి పెట్టుకున్నారు.
తాజాగా తన బావ (కృష్ణ మేనల్లుడు) సుధీర్ హీరోగా నటించిన 'ఎస్ఎంఎస్' సినిమా ఆడియో వేడుకకు మహేష్ బాబు హాజరు కావడం అందరినీ ఆకర్షించింది. మహేష్ బాబు ఏమిటి? ఇతరు సినిమా ఫంక్షన్లలో కనిపించడం ఏమిటి అని చాలా మంది ఆశ్చర్య పోయారు. మహేష్ బాబు బంధు ప్రీతి ప్రదర్శిస్తున్నారు అంటూ చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











