ఆ విషయంలో బాలకృష్ణ,జూ ఎన్టీఆర్ ల ఎక్సేంజ్ ఆఫర్
బాలకృష్ణ సూపర్ హిట్ సింహా చిత్రం విజయంతో దర్సకుడు బోయపాటి శ్రీనుకి మంచి డిమాండ్ ఏర్పడింది. దానితో వెంటనే జూ ఎన్టీఆర్ పిలిచి తనతో చిత్రం చేయమని ఆఫర్ ఇచ్చారు. అలాగే జూ ఎన్టీఆర్ తో రెండో సారి దర్శకత్వం వహిస్తున్న శక్తి చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ ని తన తదుపరి చిత్రానికి డైరక్టర్ గా బాలకృష్ణ ఎంపిక చేసుకున్నారు. దాంతో అబ్బాయి ఎన్టీఆర్ దర్సకుడుని బాలకృష్ణ, అలాగే బాబాయ్ బాలయ్య దర్శకుడుని ఎన్టీఆర్ ట్యూజ్ చేసుకున్నట్లయింది. ఒకరికొకరు భలే ఎక్సేంజ్ చేసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు ఎన్టీఆర్ కి సూటయ్యే యాక్షన్ తరహా కథలే బాలయ్యకీ నప్పుతాయి..కాబట్టి ఆ జెనర్ చేసే దర్శకులు ఇద్దరికీ నచ్చుతారు.
బాలకృష్ణ బోయపాటి శ్రీను మెహర్ రమేష్ జూ ఎన్టీఆర్ శక్తి సింహా simha boyapati srinu balakrishna jr ntr nayantara shakti meher ramesh


Click it and Unblock the Notifications