twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ప్లాపు’ స్టేట్మెంటుతో రామ్ చరణ్ నిజాయితీ.. ఇప్పటికైనా ఆ హీరోలు మారతారా?

    |

    రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సినిమా ప్లాప్ అయిన విషయాన్ని నిజాయితీగా ఒప్పుకుంటూ రామ్ చరణ్ ప్రకటన విడుదల చేయడం, అందులో అభిమానులను అపాలజీ కోరడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

    ఇప్పటి వరకు ఇండస్ట్రీలో పెద్దగా ఆడని సినిమాలను కూడా హిట్టయినట్లు కవర్ చేసుకునే సంస్కృతి కొనసాగిందని.. దాన్ని ఫాలో కాకుండా నిజాన్ని నిజాయితీగా ఒప్పుకుంటూ రామ్ చరణ్ కొత్త సంస్కృతి మొదలు పెట్టారని, దీనితో ఆయన స్థాయి, హుందాతనం మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    సినిమా ప్లాపుకు కారణం ఏమిటి?

    సినిమా ప్లాపుకు కారణం ఏమిటి?

    ‘వినయ విధేయ రామ' సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం దర్శకుడు బోయపాటి రాసుకున్న స్క్రిప్టు, ఓవర్‌గా డిజైన్ చేసిన యాక్షన్ సీన్లే అనే అభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. అయిననప్పటికీ రామ్ చరణ్ తాను విడుదల చేసిన ప్లాప్ స్టేట్మెంటులో ఎక్కడా కూడా బోయపాటి పేరు ప్రస్తావించక పోవడం గమనార్హం.

    గతంలో ఆ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా కవర్ చేశారా?

    గతంలో ఆ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా కవర్ చేశారా?

    బోయపాటి ఇంతకు ముందు మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్‌తో ‘సరైనోడు' సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినా... దాన్ని కవర్ చేసి సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు, బ్లాక్ బస్టర్ అయినట్లు బిల్డప్ ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. ‘వినయ విధేయ రామ' విడుదల తర్వాత ఆ విషయాన్ని చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు.

    ఇప్పటికైనా హీరోలు మారతారా?

    ఇప్పటికైనా హీరోలు మారతారా?

    రామ్ చరణ్ విడుదలచేసిన ‘ప్లాప్' స్టేట్మెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇకనైనా ప్లాప్ సినిమాలను హిట్ అయినట్లు కవర్ చేసుకునే సంస్కృతి మారాలని, అప్పుడే ప్రేక్షకుల్లో హీరోలు, దర్శకులపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.

    ఒక్కటే మార్గం

    ఒక్కటే మార్గం

    ప్లాప్ సినిమాను హిట్ సినిమాగా కవర్ చేయడం వల్ల... అసలు నిజాలు బయటకు రాకుండా పోతాయి. దీంతో ఆ దర్శకుడు లేదా హీరో మార్కెట్ స్టామినా అంచనా వేయడం కష్టం అవుతుంది. చివరకు బాక్సాఫీసు వద్ద ఫలితాలు బెడిసికొడతాయి. ఇలాంటివి జరుగకుండా ఉండాలంటే సినిమా హిట్, ప్లాపులను నిజాయితీగా ఒప్పకుని ముందుకు సాగడం ఒక్కటే మార్గం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    ఇండస్ట్రీ షేక్ అవుతోంది

    ఇండస్ట్రీ షేక్ అవుతోంది

    ‘వినయ విధేయ రామ' విషయంలో రామ్ చరణ్ నిజాయితీగా తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇకపై ప్లాప్ సినిమాలను హిట్ సినిమాలుగా కవర్ చేసుకునే అవకాశం ఉండక పోవచ్చు. ఈ పరిణామాలను ఎలా జీర్ణించుకోవాలో కొందరికి అర్థం కావడం లేదు.

    English summary
    Actor Ram Charan has taken full responsibility for the failure of his latest Telugu release Vinaya Vidheya Rama. He said the film didn't elicit the expected response as it didn't meet the expectations of the audience. Boyapati Sreenu-directed Vinaya Vidheya Rama released last month for the Sankranti festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X