రచ్చ వానపాట: నొక్కేసుకో నా.. సామిరంగ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో 'రచ్చ' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి నటించిన సూపర్ హిట్ సాంగ్ 'వాన వాన వెల్లువాయే' సాంగును కూడా రీమిక్స్ చేశారు. ఇటీవలే ఈచిత్రం ఆడియో కూడా విడుదలైంది. అప్పట్లో చిరంజీవి-విజయశాంతి కలిసి ఈ సాంగును యమ రంజుగా పండించారు. వాన పాట కాబట్టి ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు, హీరో హీరోయిన్ల మధ్య కసెక్కించే రొమాన్స్, తడిసిన అందాలతో హీరోయిన్ హాట్ హాట్ ఎక్స్ ఫోజింగ్. హీరో హీరోయిన్ నడము, ఇతర అందమైన భాగాలను రస రమ్యంగా నొక్కడం లాంటి సీన్లు...అబ్బో ఇలా చెప్పడం కంటే ఆ పాటను కళ్లారా చూస్తేనే మజావస్తుంది.
అయితా చాలా మంది హీరోయిన్లు ఎంత ఎక్స్ ఫోజింగ్ చేయడానికైనా రెడీ అంటా కానీ....ఇలాంటి వాన పాటల్లో హాట్ టచ్చింగ్స్‌కు మాత్రం కొందరు మాత్రమే ఒప్పుకుంటారు. రచ్చ వాన పాటలో టచ్చింగ్ సీన్లకు కూడా తమన్నా తొలుత వెనకముందు ఆలోచించినా చివరకు ఒప్పేసుకుంది. తమన్నా నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దర్శకుడు ఈ పాటను ఓ రేంజ్‌లో చిత్రీకరించారు. పక్కన చూస్తున్నది ఆ పాటలోని ఫోటోనే. చెర్రీ, తమన్నా మధ్య టచ్చింగ్స్ ఏ రేంజ్‌లో ఇట్టే అర్థమవుతోంది.
సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'రచ్చ' సినిమాను ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం ఏప్రిల్ చివరి వారంలోగానీ, మే నెలలోగానీ విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











