బెదిరింపులు... విజయవాడ నడిరోడ్డులో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రెస్‌మీట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మ!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఎన్నికల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. పోలింగ్ ముగియడంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. మే 1న ఈ మూవీ ఏపీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్‌కు సంబంధించి విజయవాడలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా వర్మ అండ్ టీంకు ఊహించని అనుభవం ఎదురైంది. చిత్ర బృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయకుండా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, హోటల్స్ అద్దెకు ఇవ్వకుండా నిర్వాహకులను బెదిరిస్తున్నారని తెలుస్తోంది.

ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్నింగ్ ఇవ్వటంతో భయంతో
‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్‌లో నిర్ణయించాం, కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్నింగ్ ఇవ్వటంతో భయంతో మాకు ఇచ్చిన అనుమతి కేన్సిల్ చేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోటట్స్, క్లబ్బుల మేనేజ్మెంట్లు మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు.'' అంటూ వర్మ ట్వీట్ చేశారు.

పైపుల రోడ్డులో నడి రోడ్డు మీద ప్రెస్ మీట్
‘‘అందుకే పైపుల రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. మీడియా మిత్రులకి, ఎన్‌టిఆర్ నిజమైన అభిమానులకి, నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజాన్ని గౌరవించే ప్రజలందరూ నేను పెట్టబోతున్న మీటింగులో పాల్గొన్నడానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం.'' అంటూ వర్మ తెలిపారు.

నిజాన్ని ఎవరూ ఆపలేరు
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విషయంలో కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అలా చేస్తున్న వారు అందూ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. నిజాన్ని ఎవరూ ఆపలేరు.. అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా బెదిరేది లేదని స్పష్టం చేశారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్
లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకంటే ముందే విడుదల చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. ఇందులో చంద్రబాబును విలన్‌గా చూపించారని, ఇది ఎన్నికలపై ప్రభావం పడుతుందని తెలుగు దేశం పార్టీకి చెందిన వారు ఆంధప్రదేశ్ హై కోర్టును ఆశ్రయించడంతో రిలీజ్ కాకుండా స్టే ఇచ్చింది. దీనితో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల కాలేదు. తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో రిలీజైంది.


Click it and Unblock the Notifications











