టాలీవుడ్.... హాటెస్ట్ లిప్ కిస్ సీన్స్!
హైదరాబాద్: ముద్దంటే చేదెవరికి? ఒకప్పుడు ము..ము...ముద్దంటే చేదా అనే పాటలు వినిపించేవి తెలుగు సినీ పరిశ్రమలో. ఆపై బుగ్గపై ముద్దులు టాలీవుడ్లో కామన్ అయిపోయి. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో లిప్ లాక్ సీన్లతో అదరగొడుతుంటే మనమేమైనా తక్కువా? అంటూ మన తెలుగు ప్రేక్షకులకు కూడా లిప్ లాక్ కిస్ సీన్ల్ల రుచి చూపిద్దాం అంటూ సిద్ధం అయ్యారు దర్శకులు.

మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా 2004లో వచ్చిన ‘నాని' సినిమాతో బాలీవుడ్ భామ అమీషా పటేల్‌తో ముద్దు సీన్ చేయడానిక డేర్ చేసాడు. ఆ తర్వాత బిజినెస్‌మేన్ చిత్రంలో కూడా కాజల్ అగర్వాల్‌తో ముద్దు సీన్ చేసాడు.

అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటు డాన్స్ లతో కాదు...ముద్దు సీన్ల హీరోగా టాలీవుడ్లో ఫేమస్ అయ్యాడు. వరుడు చిత్రంలో భానుశ్రీతో ఘాటైన ముద్దు సీన్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత వేదం చిత్రంలో దీక్షా సేథ్‌తో, ఆర్య 2 చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో ముద్దు సీన్లో అదర గొట్టాడు.

గోపీచంద్
హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపీచంద్ లక్ష్యం చిత్రంలో హాట్ హీరోయిన్ అనుష్క పెదాలను ముద్దాడాడు.

రానా-ఇలియానా
పూరి దర్శకత్వంలో రానా-ఇలియానా జంటగా రూపొందిన ‘నేను నా రాక్షసి'చిత్రం విడులకు ముందుకు ఈ ఇద్దరు ముద్దు సీన్లో పాల్గొన్నట్లు విడుదలైన పోస్టర్ సంచలన సృష్టించింది.

నాగచైతన్య-సమంత
ఏమాయ చేసావె చిత్రంలో నాగచైతన్య సమంత పెదాలను ముద్దాడటం.... ఇష్టం లేనట్లు నటిస్తూనే సమంత నాగచైనత్యకు తన పెదాలు అందించడం సినిమాకు హైలెలట్‌గా నిలిచింది.

తీన్ మార్
తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ కూడా త్రిషతో ముద్దు సీన్ చేసి అభిమానులతో ఈలలు వేయించారు.
దీంతో ఇప్పటి తరం తెలుగు సినిమాల్లో పెదాలపై ముద్దులు సీన్లు సర్వసాధారణం అయిపోయాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, గోపీచంద్, రానా లాంటి హీరోలంతా ముద్దు సీన్లతో తెలుగు తెరపై దుమ్ము రేపుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్లో సెన్సేషన్ సృష్టించిన లిప్ కిస్ సీన్లపై ఓ లుక్కేద్దాం.


Click it and Unblock the Notifications











