»   » విడాకుల తర్వాత.... సెక్సీగా చెలరేగిపోతున్న హాట్ బ్యూటీ (వీడియో)

విడాకుల తర్వాత.... సెక్సీగా చెలరేగిపోతున్న హాట్ బ్యూటీ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పాకిస్థాన్‌ సంతతికి చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్ 2013లో అసద్ ఖటాక్ ను పెళ్లాడి సినిమాలకు దూరమైంది. ఈ నాలుగేళ్ల గ్యాపులో ఈ దంపతులు ఓ పాపకు, బాబుకు జన్మనిచ్చారు. అయితే వీణా మాలిక్ కు మళ్లీ సినిమాలపై మనసు లాగడం, నటించేందుకు భర్త అడ్డు చెప్పడంతో ఏకంగా విడాకులు తీసుకుంది.

విడాకుల తర్వాత వీణా మాలిక్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి అందరికీ తెలిసేలా ఓ సెక్సీ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

హాటెస్ట్ వీడియో

బాలీవుడో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీణా మాలిక్.... మళ్లీ తన అందాలతో ప్రేక్షకులను, అభిమానులను మత్తెక్కించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఈ వీడియో ద్వారా సందేశం పంపింది.

లుకింగ్ హాట్

గత నాలుగేళ్లుగా సినిమాలకు దూరం కావడంతో చాలా మంది వీణా మాలిక్ ను మరిచిపోయారు. అయితే తాజాగా విడుదల చేసిన వీడియోతో వీణా మాలిక్ పేరు ఇండియన్ ఎంటర్టెన్మెంట్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయింది.

సంప్రదింపులు

సంప్రదింపులు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... వీణా మాలిక్ ప్రత్యేకంగా ఓ మేనేజర్ ను నియమించుకుని బాలీవుడ్ దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాజా ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అందరికీ సందేశం పంపుతోంది.

స్పెషల్ ఆల్బమ్స్

స్పెషల్ ఆల్బమ్స్

సినిమాలతో పాటు స్పెషల్ ఆల్బమ్స్ కూడా చేయాలని వీణా మాలిక్ నిర్ణయించుకుంది. హాట్ అండ్ సెక్సీగా మరిన్ని వీడియో ఆల్బమ్స్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇక వీణా మాలిక్ అభిమానులకు పండగే.

English summary
Drama Queen is Veena Malik's New Sexy & Hottest Video Song Promo released after Divorce !! Check it now ! She is Back with Bang. She looks HOT.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu