For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మత్తెక్కించే టాలీవుడ్ హాటెస్ట్ ఐటం గర్ల్స్.. (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ప్రస్తుతం నడుస్తున్న ట్రెండు ప్రకారం తెలుగు సినిమా అంటే ఐటం నెంబర్ ఉండాల్సిందే. ప్రతి సినిమాలోనూ అదొక తప్పనిసరి మసాలా అయిపోయింది. ఒకప్పుడు ఐటం సాంగులు చేసేందుకు ప్రత్యేకంగా భామలు ఉండే వారు. కానీ ఈ మధ్య స్టార్ హీరోయిన్లు కూడా ఐటం సాంగులు చేస్తున్నారు.

  హన్సిక, సమీరా రెడ్డి, చార్మి, పార్వతి మెల్టన్, శ్వేతా బసు ప్రసాద్, ముమైత్ ఖాన్, హంసా నందిని, యానా గుప్తా, ఉదయభాను, చార్మి, రీచా గంగోపాధ్యాయ్, మలైకా అరోరా ఖాన్ లాంటి హాట్ భామలు తెలుగు సినిమాల్లో ఐటం సాంగులతో వినోదం పంచిన వారే. ఇప్పటి వరకు టాలీవుడ్లో అదర గొట్టిన 20 మంది స్టార్లపై ఈ రోజు ఫోటో ఫీచర్లో ఓ లుక్కేద్దాం...

  ముమైత్ ఖాన్

  ముమైత్ ఖాన్

  టాలీవుడ్ హాటెస్ట్ ఐటం గర్ల్స్‌లో ముమైత్ ఖాన్ ఒకరు. తెలుగులో ఎక్కువ ఐటం సాంగులు చేసిన భామల్లో ఈవిడా ఒకరు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లోనూ ఐటం సాంగులు చేసింది.

  హంసా నందిని

  హంసా నందిని

  ప్రస్తుతం టాలీవుడ్లో ఫాంలో ఉన్న ఐటం భామల్లో హంసా నందిని ఒకరు. ‘మిర్చి' సినిమాలో ఐటం గర్ల్‌గా మారిన హంసా నందిని...ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంది. ఎన్టీఆర్ నటించిన ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో, పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది', నాగార్జున ‘భాయ్', బాలకృష్ణ ‘లెజెండ్' చిత్రాల్లో ఐటం సాంగ్స్ చేసింది.

  హన్సిక ఐటం సాంగ్

  హన్సిక ఐటం సాంగ్

  సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న హన్సిక కూడా పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసి మెప్పించింది.

  శ్రీయ ఐటం సాంగ్స్

  శ్రీయ ఐటం సాంగ్స్

  స్టార్ హీరోయిన్‌గా సౌతిండియాలోని అగ్రహీరోలందరితోనూ నటించిన శ్రీయ......ఐటం సాంగులు కూడా చేస్తూ తాను ఆల్ రౌండర్‌ అని నిరూపించుకుంది.

  తాప్సీ ఐటం సాంగ్

  తాప్సీ ఐటం సాంగ్

  హీరోయిన్ తాప్సీ కూడా పలు చిత్రాల్లో ఐటం సాంగులతో అదరగొట్టింది. ఆమె హాట్ అండ్ సెక్సీ ఒంపు సొంపులు ఐటం సాంగులకు మరింత వన్నె తెస్తాయి.

  ప్రియమణి ఐటం సాంగ్

  ప్రియమణి ఐటం సాంగ్

  షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్' లో ప్రియమణి ఐటం సాంగ్ చేసింది.

  సమీరా రెడ్డి ఐటం సాంగ్

  సమీరా రెడ్డి ఐటం సాంగ్

  హీరోయిన్ సమీరా రెడ్డి ఇటీవల వచ్చిన ‘కృష్ణం వందే జగద్దురుమ్' చిత్రంలో ఐటం సాంగు చేసింది.

  పార్వతి మెల్టన్

  పార్వతి మెల్టన్

  మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘దూకుడు' చిత్రంలో పార్వతి మెల్టన్ ఐటం సాంగులో అదరగొట్టింది.

  యానా గుప్తా

  యానా గుప్తా

  చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్' చిత్రంలో యానా గుప్తా ‘ఆకలేస్తే అన్నం పెడతా' అనే ఐటం సాంగ్ చేసింది.

  తమన్నా

  తమన్నా

  హీరోయిన్ తమన్నా కూడా ఐటం గర్ల్‌గా మారింది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ నెల 25న రాబోతున్న ‘అల్లుడు శీను' చిత్రంలో తమన్నా ఐటం సాంగ్ చేసింది.

  కాజల్ అగర్వాల్

  కాజల్ అగర్వాల్

  హీరోయిన్ కాజల్ అగర్వల్....బ్రహ్మానందంతో కలిసి ‘గీతాంజలి' చిత్రంలో ఐటం సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈచిత్రం విడుదల కానుంది.

  శ్వేతా భరద్వాజ్ ఐటం సాంగ్

  శ్వేతా భరద్వాజ్ ఐటం సాంగ్

  మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ శ్వేతా భరద్వాజ్ ఐటం సాంగు చేసి అదరగొట్టింది.

  శ్వేతా బసు ప్రసాద్

  శ్వేతా బసు ప్రసాద్

  కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్....అవకాశాలు దగ్గడంతో ఐటం సాంగుల వైపు మళ్లింది.

  యాంకర్ ఉదయభాను

  యాంకర్ ఉదయభాను

  యాంకర్ ఉదయ భాను ఆ మధ్య వచ్చిన ‘లీడర్' సినిమాతో పాటు ‘జులాయి' చిత్రంలో ఐటం సాంగ్ చేసింది.

  మధురిమ ఐటం సాగ్

  మధురిమ ఐటం సాగ్

  అల్లు శిరీష్ నటించిన ‘కొత్త జంట' చిత్రంలో మధురిమ ఐటం సాంగ్ చేసింది.

  నటాలియా కౌర్

  నటాలియా కౌర్

  బ్రెజిల్ బ్యూటీ నటాలియా కౌర్ నవీన్ చంద్ర నటించిన ‘దళం' చిత్రంలో ఐటం సాంగ్ చేసింది.

  రచన మౌర్య

  రచన మౌర్య

  నటి రచనా మౌర్య కూడా తెలుగులో వచ్చిన ‘ఒక్కడినే', ‘శౌర్యం' చిత్రాల్లో ఐటం సాంగులు చేసింది.

  మలైకా అరోరా..

  మలైకా అరోరా..

  మలైకా అరోరా ‘గబ్బర్ సింగ్' చిత్రంలో చేసి ‘కెవ్వు కేక' ఐటం సాంగ్ సూపర్ హిట్ అయింది.

  చార్మి

  చార్మి

  హీరోయిన్ చార్మి ఈ మధ్య ఐటం సాంగులు కూడా చేస్తోంది. నాగార్జున నటించిన ఢమరుకం, రగడ తో పాటు పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేసింది.

  లక్ష్మిరాయ్

  లక్ష్మిరాయ్

  లక్ష్మిరాయ్ ‘బలుపు' చిత్రంలో చేసిన ఐటం సాంగ్ సినిమాకు మరింత గ్లామర్ అద్దింది.

  గాబ్రియేలా బెర్టాంటె

  గాబ్రియేలా బెర్టాంటె

  బ్రెజిల్ బ్యూటీ గాడ్రియేలా బెర్టాంటె...దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఐటం సాంగ్ చేసి ఆకట్టుకుంది.

  English summary
  Nowadays, item numbers have become part and parcel of Telugu films. In recent years, some leading actresses have also come forward to do dance numbers. Hot item girls like Mumaith Khan, Hamsa Nandini, Hansika Motwani, Sameera Reddy, Parvathi Melton, Yana Gupta, Swetha Basu Prasad, Udayabhanu, Charmi Kaur, Rachana Mourya, Malaika Arora Khan and few others have rocked the Telugu audiences with their hot raunchy dance songs.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X