సెక్సీ టిప్స్: ఈ పుస్తకంలో ఉంటాయన్న శృతి (ఫోటోలు)
హైదరాబాద్: హాట్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల ముంబైలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సందడి చేసారు. డాక్టర్ రష్మీశెట్టికి సంబంధించిన 'ఏజ్ ఎరేజ్' అనే పుస్తకం ఆమె చేతుల మీదుగా ఆ విష్కరించారు. శృతి హాసన్ మాదిరి హాట్ అండ్ సెక్సీ లుక్స్ పొందడానికి, అందం, ఆరోగ్యం కాపాడుకోవడం లాంటి విషయాలు ఇందులో ఉంటాయట.
ఈ పుస్తకంగా గురించి శృతి హాసన్ మాట్లాడుతూ...'డాక్టర్ రష్మి శెట్టి రాసిన ఈ పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం. ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి. మీ లైఫ్ స్టైల్, అందం, ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా చిట్కాలు ఇందులో ఉన్నాయి' అని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా చర్మం కాంతి వంతంగా తయారు కావడానికి, ఎక్కువ వయసున్న వారు యంగ్ అండ్ సెక్సీ లుక్ కోసం ఏం చేయాలని అనే విషయాలు ఇందులో ఉన్నాయి.

శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్ ఈ బుక్ లాంచ్ కార్యక్రమానికి బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చారు.

జాకీ భగ్నానీ, రష్మి శెట్టి, శృతి హాసన్
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జాకీ భగ్నానీ, రష్మి శెట్టి, శృతి హాసన్.

ఇదే ఆ పుస్తకం..
‘ఏజ్ ఎరేజ్' పుస్తకంతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్న శృతి హాసన్.

స్మార్ట్ లుక్
ఈ కార్యక్రమంలో శృతి హాసన్ లుక్ ఎంతో స్మార్ట్‌గా ఉంది. ఆమెను ఫోటోల్లో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.

డాక్టర్ రష్మిశెట్టితో కలిసి శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్‌తో కలిసి డాక్టర్ రష్మి శెట్టి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











