బెడ్రూం సీక్రెట్స్ : నటి శృతిపై పని మనిషి కేసు
హైదరాబాద్: దక్షిణాది నటి, కర్నాటక బీజేపీనేత శృతిపై ఆమె పని మనిషి శోభ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శృతి నుండి తనకు ప్రాణ హాని ఉందని ఆరోపణలు చేస్తూ బెంగుళూరు నగర పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.
గత నెల మే 1వ తేదీ వరకు తాను శృతి ఇంట్లో పని చేసానని పని మనిషి శోభ చెప్పుకొచ్చారు. ఇంటి విషయాలు, బెడ్రూం విషయాలు బయట పెడుతున్నానంటూ తనపై నిందలు వేసారని, ఆపై శృతి అను చరులు సతీష్, బాలు దాడి తనపై చేసారని ఆమె ఆరోపణలు చేసారు. తనపై బలవంతంగా ప్రామిసరీ నోటుపై సంతకం తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని శోభ చెప్పుకొచ్చారు.

అయితే శృతి ఈ ఆరోపణలను ఖండించారు. శోభ తన వద్ద చాలా ఏల్లుగా పని చేస్తోందని, తన సొంత మనిషిలా చూసుకున్నానని, కానీ నా గురించి చుట్టు పక్కల చెడుగా ప్రచారం చేయడంతో మే 1వ తేదీన ప్రశ్నించిన మాట వాస్తవమే అని, కానీ ఆమెపై ఎవరూ దాడి చేయలేదన్నారు.


Click it and Unblock the Notifications











