'బాహుబలి 2' సీన్ ని కాపీ కొట్టిన హాలీవుడ్ పాపులర్ వెబ్ సిరీస్.. మక్కీకి మక్కీ దించేశారుగా!
తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు ప్లాప్ టాక్ అందుకోకపోగా.. సినిమా సినిమాకు రేంజ్ పెంచుతూ, అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. తెలుగు సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో దృష్టి పడేలా చేసిని చిత్రాలు 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్', RRR. అయితే రాజమౌళి సినిమాల్లో హాలీవుడ్ స్టైల్ ఛాయలు కచ్చితంగా కనిపిస్తాయి. కానీ వాటి నుంచి స్ఫూర్తిగా తీసుకుని తన ఫాంటసీస్ తో సన్నివేశాలను తెరకెక్కిస్తాడు జక్కన్న. ఇలా రాజమౌళి ఊహా శక్తి నుంచి వచ్చిన సన్నివేశాన్ని హాలీవుడ్ వాళ్లే కాపీ కొడితే. అవును.. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే..

భారతీయ చిత్ర పరిశ్రమలోనే..
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఎల్లలు దాటించిన ఏకైక తెలుగు డైరెక్టర్ రాజమౌళి. జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు, యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఎన్నో రికార్డులను నెలకొల్పింది. అద్భుత విజయం సాధించడమే కాకుండా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. బాలీవుడ్ దర్శకనిర్మాతలు తెలుగు మేకర్స్ తో కలిసి పనిచేసేలా చేయడం, హాలీవుడ్ దిగ్గజాలు సైతం ప్రశంసలు కురిపించేలా చేశాయి జక్కన్న చెక్కిన కళాఖండాలు. వీటిలో బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు ఎనలేని విజయాన్ని సాధించాయి. సాంకేతికంగా, కథ కథానాలపరంగా, వసూళ్ల విషయంలోనూ ఎన్నో సంచలనాలను నమోదు చేశాయి.

రాజమౌళి మెచ్చిన వెబ్ సిరీస్..
అయితే హాలీవుడ్ సినిమాలు చూసి స్ఫూర్తి పొంది తెరకెక్కించే రాజమోళి చిత్రాల్లో వాటి ఛాయలు ఎక్కడో ఓ చోట తప్పకుండా కనిపిస్తాయి. ఆ సన్నివేశాలను తన ఊహా శక్తితో అద్భుతంగా మలచడంలో జక్కన్న దిట్ట. అయితే ఇప్పుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఏకంగా హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టారు. మళ్లీ అదేదో నార్మల్ హాలీవుడ్ సినిమా కాదు. వరల్డ్ నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఇది చివరి రెండు ఎపిసోడ్ లు తప్ప సిరీస్ మొత్తం ప్రపంచంలోకెల్లా నెంబర్ వన్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది. రాజమౌళి మెచ్చిన వెబ్ సిరీస్ కూడా ఇదే. ఈ వెబ్ సిరీస్ కు 200 ఏళ్ల కథతో ప్రీక్వెల్ గా వచ్చింది హౌజ్ ఆఫ్ ది డ్రాగెన్.

భారతీయ సంతతికి చెందిన మహిళ..
మొత్తం పది ఎపిసోడ్ లు ఉన్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి 9 ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. పదో ఎపిసోడ్ ఈ అక్టోబర్ 24న టెలీకాస్ట్ కానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లోని ఎనిమిదో ఎపిసోడ్ లో బాహుబలి 2 సినిమాలోని ఓ సన్నివేశాన్ని కాపీ కొట్టారు. అది కూడా మక్కీకి మక్కి దించారు. బాహుబాలి 2లో అనుష్కను అవమానించాడని సభలో సేతుపతి తల నరికే సీన్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ సన్నివేశాన్నే హాజ్ ఆఫ్ ది డ్రాగెన్ ఎనిమిదో ఎపిసోడ్లో వాడారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సన్నివేశాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. మరో విశేషమేంటంటే.. ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకురాలు గీతా వసంత్ పటేల్ భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం. గీతా వసంత్ స్క్రీన్ రైటర్ గా కెరీర్ ప్రారంభించి.. ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, బ్లూ క్రష్ తదితర చిత్రాలకు పనిచేసింది. మీట్ ది పటేల్స్ చిత్రానికి గీతా వసంత్, ఆమె సోదరుడు రవి వసంత్ పటేల్ ఎమ్మీకీ నామినేట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











