కామిడీ చిత్రంలో రామ్ చరణ్ హీరోయిన్

By Srikanya

రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా చేసిన షాజన్ పదమ్సీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన 'హౌస్‌ఫుల్-2 అనే కామెడీ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. బాలీవుడ్ లో భారీ స్టార్ కాస్టింగ్ తో తీసిన ఈ చిత్రంపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... నటిస్తే 'హౌస్‌ఫుల్-2' లాంటి చిత్రాల్లోనే నటించాలనుందంటూ చెప్పుకుంటోంది. చిత్రం అన్నిరకాల ప్రేక్షకులను అలరిస్తుందని, మంచి వాణిజ్య విలువలున్న చిత్రమని చెబుతోంది. ఫీల్‌గుడ్ సన్నివేశాలకు 'హౌస్‌ఫుల్-2'లో కొదవేలేదని చెబుతోంది. హాస్యం కడుపుబ్బ నవ్విస్తుందని హామీ ఇస్తోంది. సాజిద్ (దర్శకుడు, నిర్మాతలు)ద్వయాల కాంబినేషన్‌ను 'విన్నింగ్' కాంబినేషన్‌గా అభివర్ణించిన పదమ్సీ సదరు చిత్రం కోసం తనను ఎంపిక చేసినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని చెబుతోంది. విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు 'హౌస్‌ఫుల్-2'లో ఉంటాయని, తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. మదూర్ బండార్కర్ 'దిల్ తో బచ్చా హై జీ' చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత సినిమాల ఎంపికలో ఈ ముద్దుగుమ్మ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X