'శ్రీరామ రాజ్యం'పై ప్రేక్షకుల స్పందన...అధ్బుతమైన రెస్పాన్స్...!
బాలయ్య రాముడిగా నటించిన 'శ్రీ రామరాజ్యం" చిత్రం నిన్న విడుదలయ్యింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. ఎన్ టి రామారావు, అంజలీదేవి నటించిన 'లవకుశ" చిత్రాన్నే మళ్ళీ తీసినా ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా 'శ్రీరామ రాజ్యం" చిత్రాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారన్న ప్రశంసలు అన్నివర్గాల ప్రేక్షకుల నుండి అందుతున్నాయి. బాలకృష్ణ-నయనతార ఫెర్ ఫార్మెన్స్ సినిమాకి చాలా హైలైట్ అయిందంటున్నారు. ఇక ఇళయరాజా సంగీతం విషయానికి వస్తే పాటలుగానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గానీ సినిమాకి ప్రాణం అంటున్నారు.
ఒక అందమైన దృశ్యకావ్యంగా 'శ్రీరామ రాజ్యం" చిత్రాన్ని మలిచిన బాపు జన్మధన్యమైందని అభినందిస్తున్నారు. కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి భక్తిరసాత్మక చిత్రానికి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు తీసినా ఆదరిస్తారని మరోసారి రుజువైందని సీన పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
బాలయ్యను మహానటుడు ఎన్టీఆర్ తో పోల్చి సినిమాని చూస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం ఎన్టీఆర్ అంత నటన బాలయ్య కనబర్చలేకపోయినా...బాలయ్య కూడా బాగా నటించారని, రాముడి గెటప్ లో బాగున్నారని కితాబులిస్తున్నారు. అదే ఎన్టీఆర్ తో పోల్చకుండా బాలయ్యను చూస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి ఫుల్ మార్కులు వేస్తారనే టాక్ కూడా కనబడుతోంది. ఏదేమైనా నందమూరి హీరోలే రాముడిగా, కృష్ణుడిగా నటించగలరనే టాక్ ని బాలయ్య నిజం చేసాడని చాలా మంది చెప్పుకుంటున్నారు. కాగా పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఈ చిత్రం వీకెండ్ లోపు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోందిని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











