twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్‌దత్‌కు శిక్ష తగ్గింపుకై

    By Srikanya
    |

    Sanjay Dutt
    న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు శిక్ష తగ్గించే విషయంలో కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో సంజయ్‌దత్‌, మరో ఇద్దరు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. వీరిలో 70 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉంది. మానవతా దృక్పథంతో వీరి శిక్ష తగ్గించాలని కోరుతూ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు మార్కండేయ కట్జూ.. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అర్జీ పెట్టారు. కట్జూ, మరికొందరు అర్జీలివ్వడంతో వాటిని రాష్ట్రపతి హోంశాఖకు పంపించారు.. దీంతో ఆ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. దత్‌, మిగతా ఇద్దరి ప్రవర్తన, మరికొన్ని అంశాలపై హోంశాఖ సమాచారం కోరినట్లు తెలిసింది. అవసరమైతే వాటిని రాష్ట్రపతి వద్దకు పంపాల్సి ఉంటుందని అధికారవర్గాల సమాచారం.

    ఇక కొద్ది రోజుల క్రితం సంజయ్ దత్‌కు తాత్కాలిక విడుదల లభించింది. 14 రోజుల పాటు పెరోల్‌పై బయటకు వచ్చేందుకు అతనికి కోర్టు అనుమతి లభించింది. అతని కాలుకు చికిత్స నిమిత్తం ఈ పెరోల్ లభించింది. ఈ మేరకు ఆయన పూణె ఎరవాడ జైలు నుంచి బయటకు రాబోతున్నాడు. 1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది.

    టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది. రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మరో 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21వ తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16వ తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్‌దత్‌ కాగిత సంచుల తయారీలో శిక్షణ పొందుతున్నాడు.

    English summary
    The Union Ministry of Home Affairs (MHA) has sought the Maharashtra government’s opinion on reducing the sentence of actor Sanjay Dutt and two others convicted in the 1993 Bombay serial blasts on “humanitarian grounds.” The actor, awarded a five-year imprisonment by the Supreme Court for possessing illegal firearms, is serving a 42-month-jail-term, having spent 18 months behind bars earlier. “We have asked the State government to provide its opinion, the jailor’s comment on the actor’s conduct and a few other issues [on giving relief to Sanjay Dutt],” a senior official said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X