twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    100% లవ్ సినిమా పైరసీని అల్లు అరవింద్ ఎలా గుర్తించారు?

    By Pratap
    |

    నాగచైతన్య హీరోగా నటించిన 100% లవ్ సినిమాను గుర్గావ్‌లోని పివిఆర్ సినిమా పైరసీ చేసిందని, ఆ సంస్థపై 5 కోట్ల రూపాయలకు దావా వేస్తానని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ఇంత కచ్చితంగా అల్లు అరవింద్ ఎలా చెప్పగలిగారని చాలా మంది ఆశ్చర్యపడ్డారు. కానీ, కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు తీసే నిర్మాతలకు పైరసీని కనుక్కునే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్లనే అల్లు అరవింద్ ఆ విషయాన్ని కనిపెట్టారని తెలుస్తోంది. పైరసీని గుర్తించే కొత్త సాఫ్ట్‌వేర్ మార్కెట్లోకి వచ్చింది.

    పైరసీని కచ్చితంగా కనిపెట్టే టెక్నాలజీని ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ లేదా డిజిటల్ వాటర్ మార్కింగ్ అంటారు. ఆడియో, వీడియో పైరసీని కూడా ఈ సాఫ్ట్‌వేర్ గుర్తిస్తుందని చెబుతున్నారు. పైరసీ జరిగిన సమయం, తేదీ, ఐపి చిరునామా వివరాలు తెలిసిపోతాయట. ఇమేజ్‌, ఆడియా, వీడియోలను లాక్ చేస్తే పైరసీ చేయడానికి చేసే ప్రయత్నాలు బయటపడతాయని అంటున్నారు. డేటా లీకయిందని గమనిస్తే బండారమంతా బయటపడుతుందట. దీని ఆధారంగానే అల్లు అరవింద్ తన సినిమా పైరసీని కనిపెట్టారని తెలుస్తోంది.

    English summary
    Producer Allu aravind identified his film 100% Love piracy with New Technology.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X