సంతోషానికి కారణమేంటి? డబ్బా, అమ్మాయిలా, ఆల్కహాలా?: విజయ్ దేవరకొండ
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల విజయంతో తెలుగుతో సంచలన హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ... డబ్బు, ఫేమ్‌తో పాటు భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఇంత సాధించినా అతడికి సంతోషం అంటే ఏమిటి? ఎలా ఉంటుందో అర్థం కావడం లేదట. దీంతో సద్దురు జగ్గీవాసుదేవ్‌ను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా కోరాడు.
కొందరు డబ్బులో ఆనందం ఉందంటున్నారు, కొందరు ఆల్కహాల్ సేవించడంలో సంతోషం ఉందంటున్నారు, కొందరు అమ్మాయిలతో ఉంటే సంతోషం ఉందంటున్నారు. నాకైతే సంతోషం ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుందో? అర్థం కావడం లేదు. దయచేసి దీనికి సమాధానం చెప్పాలని విజయ్ కోరాడు. అయితే సంతోషం మనిషిలోపల ఉంటుంది, అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుందని లాంటి సమాధానాలు మాత్రం చెప్ప వద్దని ఈ సందర్భంగా విజయ్ షరతు పెట్టారు.
విజయ్ అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తూ..... సంతోషంతో ఉండే మనిషి ఎలా ఉంటాడా? నీలా, నాలా ఉంటాడు. ఆనందం అనేది మనం ఒక వస్తువు, లేదా ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటాం. కానీ, అదో సహజసిద్ధమైన పరిణామం. మనలో సంతోషం ఉంటుందని నువ్వు చెప్పొద్దని షరతు పెట్టావు. నేను అలా చెప్పను. మానవుడి ప్రతి అనుభవం ఒక చర్య. అందుకే శాంతి, సంతోషం, ఆనందం ఇలా ఒక్కోదాన్ని ఒక్కో అనుభూతిగా అభివర్ణిస్తామని సద్దురు తెలిపారు.

నువ్వు ఒక జటిలమైన రసాయన సూప్. అయితే, నువ్వు గొప్ప సూప్‌వా? లేక ప్రియమైన సూప్‌వా? అనేది ఇక్కడ మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అది తెలిస్తే, సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది అంటూ సంతోషంగా ఎలా ఉంటుందో తెలుస్తుంది అని సద్దురు సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











