twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అధికారం చుట్టూనే సినిమా: ఇండస్ట్రీ అడుగులు ఎటు? ఆ ముద్ర నుంచి బయటపడ్డానికేనా!?

    |

    ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ ఈ మధ్య వస్తున్న ఒక వీడియో మిమ్మల్ని ఆకర్షించే ఉంటుంది. ఇండియన్ లెజెండ్ హీరో అమితాబ్ దేశం లోని చిన్న వ్యాపారులంతా వద్దని గగ్గోలు పెట్టే జీఎస్టీ కి మద్దతుగా మాట్లాడతారు. ఇదే సందర్భం లో "స్వచ్చభారత్ కోసం నావంతు సహకారం" అంటూ టాయ్ లెట్ ఏక్ ప్రేం కథా అంటూ ఏకంగా ఒక సినిమానే తీసిపారేసాడు.

    బాలీవుడ్ మొత్తం ఒక వైపునుంచే ఆలోచిస్తోంది

    బాలీవుడ్ మొత్తం ఒక వైపునుంచే ఆలోచిస్తోంది

    ఎందుకో గానీ ఇప్పుడు బాలీవుడ్ మొత్తం ఒక వైపునుంచే ఆలోచిస్తోంది. ఏపార్టీ రూలింగ్ లో ఉంటుందో, లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఏ రాజకీయ పార్టీ ఉందో వారికి పనికి వచ్చే కథలని ఎంచుకోవటం మొదలు పెట్టింది. నిజానికి బాలీవుడ్ కి ఒకప్పుడు ఉన్న "మాఫియా ఇండస్ట్రీ అన్న మార్క్" ని పోగొట్టుకోవటానికి.

    ప్రమాదకరమైన ధోరణి

    ప్రమాదకరమైన ధోరణి

    ఈ రకం సినిమాలు తీయటం అవసరమే అనిపించినా ఇందులో కూడా ఒక ప్రమాదకరమైన ధోరణి కనిపిస్తుంది. ప్రత్యేకిమంచి కొన్ని సినిమాలూ, మరి కొన్ని వీడియోలు ఆయా సందర్భాలలో రూలింగ్ లో ఉన్న పార్టీలకు పరోక్ష ప్రచార చిత్రాలుగా పనికి వచ్చేలాఉన్నాయి.

    కాంగ్రేస్ పార్టీ

    కాంగ్రేస్ పార్టీ

    భారత దేశం లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అమితాబ్ అనే పేరుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏమిటో అందరికీ తెలిసిందే. ఒకప్పుదు రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరైన అమితాబ్ కాంగ్రేస్ పార్టీకి ఎంత సపోర్ట్ గా ఉన్నారన్నది కూడా బహిరంగ రహస్యమే.

    జీఎస్టీ (GST) పన్నుకు అనుకూలంగా

    జీఎస్టీ (GST) పన్నుకు అనుకూలంగా

    కానీ ఇప్పుడు ఆయన భార్య జయ బాదురీ సమాజ్ వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు పంపబడింది. కానీ ఇప్పుడు అమితాబ్ పోకడ మాత్రం పూరిస్థాయి లో కేద్ర ప్రభుత్వం లో అధికార పార్టీ వైపే ఉన్నారన్నది సుష్పష్టం. ప్రస్తుతం జూలై ఒకటి నుంచీ అమలు కాబోతున్న జీఎస్టీ (GST) పన్నుకు అనుకూలంగా ప్రచారం చేయటానికి అంబాసిడర్ గా ఎంపిక అయ్యారు...

    కుష్బూ గుజరాత్ కీ

    కుష్బూ గుజరాత్ కీ

    ఇక అమితాబ్ బచ్చన్ ప్రధాని మోడీ విషయం లో మాట్లాడే విషయం లో ఎందుకు మౌనం వహిస్తారన్నది కూడా ఒకప్పుడు ఆయన గుజరాత్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా " కుష్బూ గుజరాత్ కీ" అంటూ ఉన్నారన్నది గుర్తిస్తే అర్థమైపోతుంది.

    కాంగ్రేస్ అధికారం లోఉన్నప్పుడు

    కాంగ్రేస్ అధికారం లోఉన్నప్పుడు

    1984 లో అలహాబద్ నుంచి లోక్ సభకి కాంగ్రేస్ తరఫున పోటీ చేసిన ఈ బాలీవుడ్ మెగాస్టార్ ఇప్పుడు తన పంథాని పూర్తిగా మార్చుకున్నారు. కానీ ఇదే అమితాబ్ కాంగ్రేస్ అధికారం లోఉన్నప్పుడు మాత్రం "పోలియో అవేర్నెస్ కోసం ప్రచారకర్తగా చేసారు. ఇలా అధికారం లో ఏపార్టీ ఉంటే ఆవైపుగానే ఈ ఇండియన్ లెజెండ్ యాక్టర్ అడుగులుపడ్డాయి.

    స్వచ్చభారత్

    స్వచ్చభారత్

    ఇక బాలీవుడ్ లో మరో హీరో అక్షయ్ కుమార్ విషయానికి వస్తే ఆయన ఈ మధ్య నిర్మించిన "టాయిలెట్: ఏక్ ప్రేం కథా" లాంటి సినిమా గురించి మాట్లాడుతూ.. "ప్రభుత్వం నిర్వహించే "స్వచ్చభారత్" ప్రోగ్రాం కి నా వంతుసహకారమే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

    రుస్తుం

    రుస్తుం

    అంతే కాదు ఇదే సినిమా ప్రచారం లో భాగంగా ప్రధాని మోడీని కలిసాడు కూడా. అంతే కాదు అక్షయ్ కుమార్ కెరీర్ బిగ్గెస్ట్ సూపర్ హిట్, ఆయనకి జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన సినిమా రుస్తుం లో ప్రధాని మోడీ ని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసాడు. ఇక ఇప్పుడు అక్షయ్ తీసుకున్న మార్గం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

    ఇందు సర్కార్

    ఇందు సర్కార్

    ఇక ఇదే విషయాన్ని మరో కోణం లో గనక చూసుకుంటే పాపులర్ బాలీవుడ్ ఫిలిం మేకర్ మాధుర్ బండార్కర్ తీస్తున్న "ఇందు సర్కార్" నీల్ నిథిన్ ముకేష్ హీరోగా మాజీ ప్రధాని దివంగత రాజీవ్ ఘాంధీ ని గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసాడు. 1975 కాలం లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి సంగటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నట్టు సమాచారం. ఈ వార్త కాంగ్రేస్ వర్గాల్లో కలకలం రేపింది.

    70% కల్పిత సంఘటనలు

    70% కల్పిత సంఘటనలు

    దీనిపై వచ్చే విమర్షలకు సమాధానం గా "70% కల్పిత సంఘటనలూ 30% నిజమైన ఘటనలను తీసుకుని కథ రాసుకున్నానని" సమర్థించుకునే ప్రయత్నం చేసాడు మాథుర్ భండార్కర్. ఇందులో ఎవ్వరినీ ప్రధాన పాత్రలుగా చూపించటం లేదనీ, కనీసం పేర్లను కూడా వాడుకోవటం లేదనీ చెప్పటం తో. ఇక ఈ సినిమాని ఆపటానికి సెన్సార్ బోర్డ్ కి కూడా ఎలాంటి కారణమూ దొరకలేదు. ఇదే సినిమాలో నటించిన సీనియర్ నటుడు, ఇప్పటి బీజేపీ నేత అనుపమ్ ఖేర్ "ది యాక్సిడేంటల్ ప్రైం మినిస్టర్" అనే సినిమాలో ఆపద్దర్మ ప్రధాని పాత్రలో కనిపించనున్నారు.

    సోనియా గాంధీ క్యాబినెట్ లో

    సోనియా గాంధీ క్యాబినెట్ లో

    ఈ సినిమా ఒకప్పటి సోనియా గాంధీ క్యాబినెట్ లో ఉండి అసమర్థుడుగా విమర్శలనెదుర్కున్న సింగ్స్ మీడియా అడ్వైజర్ సంజయ్ బారూ రాసిన పుస్తకం ఆధారంగా నిర్మించబడుతోంది. అయితే ఈ సినిమాలో బీజేపీ వాదిగా ముద్రపడ్డ అనుపం ఖేర్ నటించటం ఇప్పుడు చర్చలకు దారి తీస్తోంది. ఆయన భార్య కిరణ్ ఖేర్ చండీఘడ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఉందటం కూడా గమనించాల్సిన విషయమే. ఒక ప్రెస్ మీట్ లో ఆయన "ఇది నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టే సినిమా అనటం కూడా" పలు అనుమానాలకు తావిస్తోంది.

    రిషీ కపూర్

    రిషీ కపూర్

    ఇక కొన్నాళ్ళ కిందటే బాలీవుడ్ హీరో రిషీ కపూర్ కూడా దేశం లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టులకు, స్థలాలకూ నెహ్రూ, గాంధీల పేర్లు పెట్టడం మీద ప్రశ్నించి, పెద్ద దుమారమే రేపి బీజేపీ దృష్టిలో పడటానికే ఇలాంటి వ్యాఖ్యలు చేసాడన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. రిషీ కపూర్ తో పాటుగా "ప్రో బీజేపీ" అన్న ముధ్ర పడ్ద బాలీవుడ్ నటుల్లో పరేష్ రావెల్, అనుపం ఖేర్, హేమ మాలినీ, శతృఘ్న సిన్హా... తదితరులున్నారు.

    అమీర్ ఖాన్ కూడా

    అమీర్ ఖాన్ కూడా

    వీరు తీస్తున్న సినిమాలూ, చేస్తున్న వ్యాఖ్యలూ పూర్తిగా ఇప్పటి అధికార ప్రభుత్వం లో ఉన్న పెద్దల దృష్టిని తమ వైపుకు తిప్పుకోవటం కోసమే చేస్తున్నారు అన్న మాటలకు తావిస్తున్నాయి... నిజానికి ప్రస్థుత పరిస్థితికి అద్దం పట్టే విషయం ఏమిటంటే చిన్న మాటతో దేశవ్యాప్తంగా "దేస ద్రోహీ అన్న అపకీర్తి మూట గట్టుకున్న" అమీర్ ఖాన్ కూడా అర్జెంట్ గా అధికార పార్టీ వైపు మొగ్గు చూపటమే. మొత్తానికి ఇప్పుడు బాలీవుడ్ మొత్తం దేశ రాజకీయాల చుట్టూ తిరుగుతుందన్నది మాత్రం స్పష్తం....

    English summary
    Bollywood, it seems, is striving to stay on the right side of the ruling dispensation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X