twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఏనుగు ఎలా ఎక్కారు? ( ఫన్నీ వీడియో)

    By Srikanya
    |

     SS Rajamouli
    హైదరాబాద్ : భాక్సాఫీస్ ని ఎలా బుజ్జగించి,దానిపైకి ఎక్కి స్వారీ చేయాలో రాజమౌళికి తెలిసినట్లుగా తెలుగులో ఏ ఇతర దర్శకుడుకీ చేతకాదు అంటే అతిశయోక్తి కాదేమో. దాన్ని గుర్తు చేయటానికో ఏమో కానీ రాజమౌళి షూటింగ్ నిమిత్తం వచ్చిన ఏనుగుని మచ్చిక చేసుకుని,దానిపైకి ఎక్కారు. ఈ ప్రాసెస్ మొత్తం నాలుగు రోజులు పట్టింది. ఇందుకోసం ఆయన ఓ వీడియోని రిలీజ్ చేసారు.

    ఆ లింక్ ఇదే...

    ఇక దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి ఓ అలవాటు ఉంది. హీరో చేత ఏం చేయించాలన్నా... ఆ పని ముందు తాను చేయడం. అప్పట్లో 'మగధీర' కోసం కత్తియుద్ధం నేర్చుకొన్నారు. ఇప్పుడు 'బాహుబలి' కోసం ఏనుగెక్కారు. అయితే ఆ ఏనుగు జక్కన్నకు సులభంగా లొంగలేదు. తొలిరోజు ఏనుగు చెవి భాగం నుంచి ఎక్కాలని చూసి విఫలమయ్యారు. రెండో రోజు బుజ్జగించారు. మూడోరోజు పళ్లు తినిపించి మచ్చిక చేసుకొన్నారు. నాలుగో రోజు.. ఏనుగు తొండం చాచి.. రాజమౌళికి సహకరించింది. అలా.. ఏనుగు ఎక్కడానికి నాలుగు రోజులు పట్టిందన్నమాట.

    నిజానికి ఏనుగు ఎక్కడం ఓ టెక్నిక్‌. దానికి ముందస్తు తర్ఫీదూ తీసుకోవాల్సిందే. ఈ సన్నాహాలన్నీ ఓ చిన్న వీడియో తీసి 'ఏనుగుని మచ్చిక చేసుకోవడం ఎలా?' అంటూ యూ ట్యూబ్‌లో విడుదల చేశారు రాజమౌళి. 1.16 నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో ఏనుగును ఎలా మచ్చిక చేసుకోవాలో చూపించారు. 'బాహుబలి' చిత్రీకరణ సందర్భంగా చోటుచేసుకొనే ఇలాంటి సరదా వీడియోల్ని Baahubali@SETERA అనే పేరుతో విడుదల చేస్తానంటున్నారాయన. ఇలాంటి సరదా సంఘటనలు మరిన్ని అందులో చూడొచ్చన్నమాట. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుపుకొంటోంది.

    'బాహుబలి'కోసం అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 'ఛత్రపతి' తర్వాత ప్రభాస్‌తో ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. ఈ సినిమా పై ట్రేడ్ లో ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ప్రభాస్,అనుష్క పుట్టిన రోజులను పరస్కరించుకుని విడుదల చేసిన మేకింగ్ వీడియోలు ఇప్పటికే అందరిలో అమితమైన ఆసక్తిని రేపటంలో సఫలీకృతమయ్యాయి.

    English summary
    This video features exclusively director SS Rajamouli and him trying to get on an elephant. Rajamouli’s son Karthikeya shooting behind the scenes of Bahubali tried few ways to climb an elephant and not succeeded in his attempts. Our tough taskmaster used a bit of brain to make amity with elephant by giving bananas every day. On fifth day, he could manage to get on elephant. The video goes viral in social networking sites and many wondered by watching the dedication of the director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X