Salaar ప్రభాస్ మూవీని తొక్కేసేందుకు ముంబైలో భారీ కుట్ర? అలా టికెట్లు అమ్మకుండా .. ముంబై థియేటర్ ఓనర్ షాకింగ్‌

ఉత్తరాది సినిమా పరిశ్రమలో షారుక్ ఖాన్ నటించిన డంకీ, ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు సంబంధించిన డిస్టిబ్యూటర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్దం జరుగుతున్నది. షారుక్ సినిమాకు ప్రాధాన్యం ఇస్తూ సలార్ అడ్వాన్స్ బుకింగ్‌‌ను అడ్డుకొన్నారు అంటూ ముంబైలో ప్రతిష్టాత్మక థియేటర్ జెయిటీ గెలాక్సీ, మరాఠా మందిర్ యజమాని మనోజ్ దేశాయ్ ఆ కుట్రను మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..

సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేయకుండా డిస్టిబ్యూటర్లు కుట్ర చేశారు. దాంతో హైదరాబాద్‌లో డంకీ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను మల్టీప్లెక్స్‌లో ప్రభాస్ ఆపివేశారు. ఈ విషయంలో ప్రభాస్ కరెక్ట్. అయితే సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఎందుకు ఓపెన్ చేయడం లేదని ప్రేక్షకులు మమ్మల్ని నిలదీస్తున్నారు. డంకీ సినిమా డిస్టిబ్యూటర్లు చేస్తున్న పనులు సరికాదు అని మనోజ్ దేశాయ్ అన్నారు.

 How Dunki Distributors Conspiracy on Salaar: Mumbais Gaiety Galaxy owner Manoj Desai revealed

సలార్ సినిమా రేపు (డిసెంబర్ 22న) రిలీజ్ అవుతున్నది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. ఆన్‌లైన్ టెక్నాలజీ తెలియని వాళ్లు నేరుగా వచ్చి టికెట్లు కొంటారు. వారందరూ వచ్చి ఎందుకు సలార్ టికెట్లు అమ్మడం లేదని ప్రశ్నిస్తున్నారు. మా వద్ద తక్కువ టికెట్ రేట్ పెట్టి చూడాలని వారికి సమస్య ఎదురైంది. సలార్ సినిమా టికెట్లు అమ్మమని ఏదైనా న్యూస్ వస్తే అందరికి చెబుతాను అని మనోజ్ దేశాయ్ చెప్పారు

డంకీ, సలార్ సినిమా మధ్య పోటీ భారీగా ఉంది. డిస్టిబ్యూటర్స్ చేసే రాజకీయాల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పెద్ద హీరోల సినిమాలు ఒకసారి రిలీజ్ చేసేటప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతున్నది. జైటీ గెలాక్సీ థియేటర్‌లో సలార్ విడుదల చేసేందుకు నా కొడుకు ప్లాన్ చేస్తున్నారు. లేకపోతే యానిమల్ సినిమాను వేసుకొంటాను అని మనోజ్ దేశాయ్ చెప్పారు.

 How Dunki Distributors Conspiracy on Salaar: Mumbais Gaiety Galaxy owner Manoj Desai revealed

జెయిటీ గెలాక్సీ థియేటర్‌లో సలార్ సినిమా ప్రదర్శిస్తామా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది. దాని కోసం పెద్ద ఫైట్ జరుగుతున్నది. ఒకవేళ సినిమా వేస్తే టికెట్స్ అమ్ముతాం. లేకపోతే ఎందుకు జరగలేదో కూడా చెబుతాం. అప్పటి వరకు మీరు ఓపిక పట్టాలి అని మనోజ్ దేశాయ్ చెప్పారు.

 How Dunki Distributors Conspiracy on Salaar: Mumbais Gaiety Galaxy owner Manoj Desai revealed

ఇదిలా ఉండగా, సలార్ సినిమాను ఉత్తరాదిలో తొక్కేయాలని చూసిన డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లపై ప్రభాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వారితో చర్చించి సినిమాను ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓ దశలో వారిపై యంగ్ రెబల్ స్టార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారని తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X