twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    71 వేల చెట్లు: ఇళయారాజా పుట్టినరోజు ఇలా...(ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి పాటల మాలను కట్టే మ్యూజిక్ మ్యాస్ట్రో పద్మభూషన్ ఇళయరాజా పుట్టినరోజు ఈ రోజు. నేటితో 71వ ఏట అడుగుపెడుతున్నారు. స్వతహాగా నిరాండబరంగా ఉండే ఇళయరాజా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారు.

    అయితే ఈ మధ్యే ఏర్పాటయిన ఆయన అభిమాన సంఘం తరుపున ఏర్పాట్లు వినూత్నంగా చేసారు. 71వ పుట్టినరోజుని పురస్కరించుకుని తమిళనాడులోని వివిధ నగరాల్లో గల అభిమాన సంఘాలకు చెందినవారు 71 వేల చెట్లు నాటాలని నిర్ణయించుకున్నారు. పర్యావరణాన్ని కాపాడే దిశలో అభిమానులు ఈ మహత్కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

    How Is Illayaraaja Celebrating His Birthday?

    ఇళయరాజా పేరుతో తొలి అఫీషియల్ ఫ్యాన్ క్లబ్ ఏప్రిల్ 5న తమిళనాడులోని మధురైలో ఏర్పాటు చేసారు. ఇందులో వందలాది సింగర్లు కూడా మెంబర్లుగా ఉన్నారు. ఇళయరాజా పెద్ద కుమారుడైన కార్తీక్ రాజా ఈ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేసారు. అదే విధంగా ఆయన చైర్మన్ హోదాలో ఈ ఫ్యాన్ క్లబ్‌లో సేవలు అందిస్తున్నారు. ఇళయారాజా అభిమానులందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఆయన ఈ ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేసారు. ఇది ప్రభుత్వంచే రిజిస్టర్ చేయబడిన ఫ్యాన్ క్లబ్. ఇప్పటి వరకు ఇందులోని సభ్యుల సంఖ్య కోటి దాటింది.

    1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన నేడు భారతదేశ సంగీత ప్రముఖ దర్శకులలో ఒకరిగా ఎదిగారు..1976లో విడుదలైన జయప్రద నటించిన 'భద్రకాళి అనే తెలుగు చిత్రంలోని 'చిన్ని చిన్ని కన్నయ్య" అనే పాటకు సంగీతాన్ని అందించి మ్యూజిక్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేసారు. తెలుగులో 'భద్రకాళి'కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది.

    నిత్య సంగీత సాధకుడుగా మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయనకు అలవాటు అయింది. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ. ఇళయరాజ మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

    ఇళయరాజ సంగీతం వింటుంటే ఎవరైనా సరే అమాంతం తన్మయత్వం అయిపోవాల్సిందే. అంతటి ఘనత ఆయనది. ఆయన ఇప్పటి వరకు వేల పాటలకు, వందలాది చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చారు. ఆయన స్వరపరిచిన సుస్వరాలో తేలియాడని సంగీతాభిమాని ఉండరనడంలో అతిశయోక్తి కాదేమో! మరి ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు వన్ ఇండియా తెలుగు తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    English summary
    Illayaraaja is turning a year older today (June 2). The Music Maestro is celebrating the day by planting the first of the 71,001 saplings. The Illayaraaja fans club members of have taken initiative to plant 71,001 saplings across the state on his birthday. It was kick-started by the Music Maestro by planting the first sapling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X