`యమలీల-2' ట్రైలర్ చూసారా..ఎలా ఉంది? (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం టాలీవుడ్ భాక్సాపీస్ వద్ద యమలీల సృష్టించిన మ్యాజిక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. దాన్ని రిపీట్ చేయటానికి ఎస్వీ కృష్ణారెడ్డి సిద్దమయ్యారు. యమలీల 2 టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియో నిన్న రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా...ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఎస్వీ కృష్ణారెడ్డి కమ్ బ్యాక్ చిత్రం అంటూంటే మరికొంతమంది...యమలీల నుంచి ఇంకా బయిటపడలేదు...తన మ్యాజిక్ ని కోల్పోయాడు అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో మీరూ చూసి చెప్పండి..

డాయం.మోహన్‌బాబు యముడి పాత్రధారిగా, డాకె.వి.సతీష్‌-దియా నికోలస్‌లను జంటగా తెరకు పరిచయం చేస్తూ.. డి.యస్‌.మ్యాక్‌‌స సమర్పణలో క్రిస్వీ ఫిలింస్‌ నిర్మిస్తున్న సినిమా `యమలీల-2'. యస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకుడు. కె.అచ్చిరెడ్డి ఆశీస్సులందిస్తున్నారు. బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటిస్తున్నారు.

దర్శకుడు ఎస్వీకే మాట్లాడుతూ-``యమలీల చేసిన రెండు దశాబ్ధాల తర్వాత `యమలీల-2' చేయడం ఆనందంగా ఉంది. యమలీలకు సంబంధం లేని కొత్త కథ ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి'' అన్నారు.

How is SV Krishna Reddy's Yamaleela-2 trailer?

హీరో డాకె.వి.సతీష్‌ మాట్లాడుతూ-``సినిమా నాకు కెరీర్‌ కాదు. ఆసక్తి. నేను సినిమాల నుంచి చాలా నేర్చుకున్నా. ఇప్పటివరకూ బిజినెస్‌లో బిజీగా ఉండడం వల్ల సినిమాల్లో నటించడానికి కుదరలేదు. ఈ సినిమాలో నేనే కాదు అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్‌బాబు, బ్రహ్మానందం అనే సూపర్‌హీరోలు పనిచేశారు. మంచి టీమ్‌తో పనిచేసినందుకు సంతోషంగా ఉంది'' అన్నారు.

అచ్చిరెడ్డి మాట్లాడుతూ-``ప్రస్తుతం బ్యాలెన్‌‌స పనులు సాగుతున్నాయి. కృష్ణారెడ్డి స్టయిల్‌లోని కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది'' అన్నారు. నవంబర్‌లో సినిమా రిలీజ్‌ చేస్తామని సహనిర్మాత అరుణ్‌కుమార్‌ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X